HCU లో ప్రతి ఏడాది జింకలు మృతికి కారణం ఇదేనా..! వెలుగులోకి అసలు వాస్తవాలు!
దేశవ్యాప్తంగా కంచె గచ్చిబౌలి వివాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక జింకపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడికి జింక మృతి చెందింది. జింకను గమనించిన సెక్యూరిటీ అధికారులు హాస్పిటల్‌కు తరలించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దేశవ్యాప్తంగా కంచె గచ్చిబౌలి వివాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక జింకపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడికి జింక మృతి చెందింది. జింకను గమనించిన సెక్యూరిటీ అధికారులు హాస్పిటల్‌కు తరలించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వీడియోల పట్ల హెచ్‌సీయులోని కొందరు విద్యార్థులు స్పందించారు. క్యాంపస్‌లో జింకలు మృతి చెందడం ఇది మొదటిసారి కాదని గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు.
గత ఏడాది సుమారు 30కి పైగా జింకలు మరణించినట్లు పలువురు విద్యార్థులు చెబుతున్నారు. క్యాంపస్ లోపల జింకలు నిత్యం తిరుగుతూనే ఉంటాయి. వేసవికాలంలో ఎక్కువ సంఖ్యలో జింకలు ప్రాణాలు కోల్పోతున్నాయి. దీనికి ప్రధాన కారణం జంతువులకు నీటి సౌకర్యం లేకపోవడమే. ఉన్న అరకొరా నీటి కొలనుల వద్దకు వెళ్ళగానే ఇతర జంతువులు దాడులకు పాల్పడుతుండటంతో జింకలు మరణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అనేకసార్లు జింకలపై కుక్కలు దాడులకు పాల్పడ్డ ఘటనలు ఉన్నాయి. ఇలాంటి సందర్భం ఎదురైన ప్రతిసారి తాము జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థులు చెబుతున్నారు.
గడిచిన ఐదు సంవత్సరాలలో సుమారు 300కు పైగా జింకలు మృతి చెంది ఉంటాయని క్యాంపస్ విద్యార్థులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదులు అందిన వెంటనే కుక్కలను అక్కడి నుండి తరలించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసి వాటిని నగర శివారులో వదులుతుంటారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చనిపోయిన జింక సంఖ్య 6 గా విద్యార్థులు చెబుతున్నారు. హెచ్ సీ యు తాజా ఆందోళనల అనేపథ్యంలో జింక మరణం కలకలం సృష్టిస్తోంది. క్యాంపస్ లోపల విద్యార్థులు ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కుక్కలు ఒకేసారిగా మూకుమూడి దాడి చేయడంతోనే జింక మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..