Police Humanity : దీనస్థితిలో ఉన్న మహిళకు సపర్యలు.. మానవత్వం చాటుకున్న మహిళా పోలీసులు..

|

Jan 26, 2021 | 1:42 PM

పోలీసులు ప్రజల రక్షణకే కాదు వారికీ కష్ట సమయంలోను తోడుగా నిలుస్తున్నారు.

Police Humanity : దీనస్థితిలో ఉన్న మహిళకు సపర్యలు.. మానవత్వం చాటుకున్న మహిళా పోలీసులు..
Follow us on

Police Humanity : ప్రస్తుతం సమాజంలో మానవత్వం కనుమరుగు అవుతున్న సమయంలో ఆ పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పోలీసులు ప్రజల రక్షణకే కాదు వారికీ కష్ట సమయంలోను తోడుగా నిలుస్తున్నారు. పోలీసుల్లో కర్కశత్వమే కాదు కారుణ్యం కూడా ఉంటుందని నిరూపించారు హైదరాబాద్ మహిళా పోలీసులు.. కఠినంగా ఉండటమే కాదు.. మంచి మనసు ఉంటుందని చాటుకున్నారు. తాజాగా మహిళా కానిస్టేబుళ్లు తమలో ఉన్న మానవత్వం చాటుకున్నారు. రోడ్డుపై అచేతనంగా దుస్తులు లేకుండా ఉన్న మహిళను స్థానిక పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను చేరదీశారు. ఆమెకు దుస్తులు కూడా వేశారు. అంతేకాదు, ఆకలితో ఆమెకు కడుపు నిండా అన్నం పెట్టారు. స్వయంగా వారి చేతులతో ఆమెకు తినిపించారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లోని హార్టికల్చర్‌ యూనివర్సిటీ ద్వారం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ మహిళ అచేతనంగా పడి ఉంది. ఒంటిపై ఎలాంటి దుస్తులు కూడా లేవు. ఇది గమనించిన స్థానికలుు 100 నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే ఆమెకు బట్టలు వేసి. మంచినీరు తాగించారు.

అయితే ఆమె తినడానికి ఏమైనా ఇవ్వాలని అడగడంతో భోజనం తెప్పించారు. ఆ మహిళ ఆహారం కూడా తినలేని దీనస్థితిలో ఉంది. దీంతో మహిళా కానిస్టేబుళ్లే ఆమెకు అన్నం కూడా తినిపించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడ బాధితురాలు తన పేరు రాజమణి, తన కొడుకు పేరు మహేష్ అని చెప్పినట్లు సమాచారం. అనంతరం పోలీసులు మహిళను హైదర్షాకోట్‌లోని కస్తూర్బా ట్రస్ట్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు.

Read Also… అమీన్‌పూర్ తీవ్ర విషాదం.. మేకపిల్లను కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయిన యువకుడు