ఇస్త్రీ లేకుండానే పర్ఫెక్ట్ లుక్..! ఈ ట్రిక్‌తో టైమ్‌, డబ్బు రెండూ సేవ్..

రోజువారీ బిజీ జీవితంలో ఇస్త్రీ చేయడం కష్టం. ఇస్త్రీ అవసరం లేకుండానే బట్టల ముడతలు పోగొట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఆవిరి, హెయిర్ డ్రైయర్, వెనిగర్ స్ప్రే వంటి పద్ధతులతో మీ దుస్తులను ముడతలు లేకుండా తాజాగా ఉంచుకోవచ్చు. సమయం ఆదా చేస్తూ ఆత్మవిశ్వాసంతో కనిపించండి.

ఇస్త్రీ లేకుండానే పర్ఫెక్ట్ లుక్..! ఈ ట్రిక్‌తో టైమ్‌, డబ్బు రెండూ సేవ్..
No Iron Clothes

Updated on: Jan 09, 2026 | 11:14 AM

ఇస్త్రీ చేసిన బట్టలు మనకు ఆత్మవిశ్వాసాన్ని, స్టైలిష్ లుక్ ని ఇస్తాయి. కానీ, ప్రతిరోజూ బట్టలు ఇస్త్రీ చేసేందుకు టైమ్‌ సరిపోదు. అలాగే, ఒక్కోసారి చిరాకు వేస్తుంది. ఇక, మన రోజువారి బిజీ లైఫ్ కారణంగా ఇలాంటి ఇస్త్రీ పనులు మరింత కష్టంగా ఉంటాయి. అయితే, ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటితో మీరు మీ బట్టలు ఇస్త్రీ చేయడానికి బదులుగా సింపుల్‌గా మడతపెట్టేసుకోవచ్చు. అదేలాగంటే…

ఉతికిన తర్వాత బట్టలు ముడతలు పడతాయి. దీని కారణంగా ప్రతిరోజూ ఇస్త్రీ చేయాల్సి వస్తుంది. ఇది నిజంగా కష్టంగానే ఉంటుంది. అందుకే మీరు ఇక్కడ ఉన్న కొన్ని చిట్కాలను ఉపయోగిస్తే, మీరు అస్సలు ఇస్త్రీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం ముందుగా మీరు బాత్రూంలో ఉన్న హ్యాంగర్లపై మీ దుస్తులను వేలాడదీయాలి. కానీ, ఈ బట్టలపై నీళ్లు పడకుండా చూసుకోండి. ఇప్పుడు 10 నిమిషాలు వేడి షవర్ ఆన్ చేసి బాత్రూమ్ తలుపు మూసివేయండి. ఇలా చేయడం వల్ల బాత్రూమ్ మొత్తం వేడి షవర్ నుండి ఆవిరితో నిండిపోతుంది. అప్పుడు మీ బట్టల ముడతలు తగ్గిపోయి, ఇస్త్రీ చేసినట్లుగా కనిపిస్తాయి.

ఇస్త్రీ చేయకుండా బట్టల ముడతలు పోవాలంటే.. మరో సింపుల్‌ పద్ధతి కూడా ఉంది.. అదేంటంటే.. ఇంట్లో ఇస్త్రీ చేయాల్సిన బట్టలను హ్యాంగర్‌పై వేసుకోండి.. మీ చేతులతో ఆ బట్టలపై కొద్దిగా నీటిని స్ప్రె చేయండి. తర్వాత హెయిర్ డ్రైయర్ తీసుకొని, దాన్ని ఆన్ చేసి బట్టలను డ్రై చేయండి. హెయిర్ డ్రైయర్ నుండి వచ్చే వేడి గాలి బట్టలపై ముడతలను తగ్గిస్తుంది. ఆ తరువాత దులిపి ధరిస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

బట్టలు ఇస్త్రీ చేసినట్లుగా కనిపించడానికి మీరు ఇంట్లోనే స్ప్రే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో స్ప్రే బాటిల్‌లో నీటితో నింపండి. దానికి కొంచెం వెనిగర్ కలపండి. బాటిల్‌కు 3:1 నిష్పత్తిలో వెనిగర్ మిక్స్‌ చేయండి. అంటే మూడు గ్లాసుల నీటికి ఒక గ్లాసు వెనిగర్‌ కలపండి. దానిని బట్టలపై లైట్‌గా స్ప్రే చేయండి. తర్వాత బట్టలను హ్యాంగర్‌పై వేలాడదీయండి. బట్టలు ఆరిన తర్వాత మీరు మంచి రిజల్ట్‌ చూస్తారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..