
ఇళ్లలో బల్లుల సమస్య సర్వసాధారణం. అయితే ఇంట్లో బల్లి కనిపించిందంటే చాలు చాలా మంది వణికిపోతుంటారు. బల్లి ఉన్న ప్రాంతానికి అస్సలు వెళ్లరు. ఇంట్లో బల్లులు పారిపోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పదేపదే వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో చాలా మంది ఆందోళన చెందుతుంటారు. కానీ కొన్ని సులభమైన పద్దతులతో మీ ఇంట్లో ఉన్న బల్లులను తరిమికొట్టవచ్చు.
☛ బల్లి ఎక్కువగా వచ్చే ఇంటి మూలలో వెల్లుల్లి, ఉల్లిపాయలను కలిపి వేలాడదీయండి. దీని వాసన ఎక్కడి గదుల్లోకి చేరుతుందో అక్కడ బల్లులు రావు. ఫ్యాన్‌కింద ఉంచడం వల్ల దాని పరిమళం ఇల్లంతా వ్యాపిస్తుంది. దీంతో బల్లి పారిపోతుంది.
☛ బల్లులు ఉన్న ప్రదేశాల్లో కోడి గుడ్డు పెంకులను ఉంచడం వల్ల మేలు జరుగుతుంది. బల్లులు అక్కడికి రావు. నిజానికి బల్లులు గుడ్డు పెంకుల వాసన నుండి పారిపోతాయి. ఈ వాసన బల్లులకు నచ్చదని, అందుకే పారిపోతాయని నిపుణులు చెబుతుంటారు.
☛ పెప్పర్ స్ప్రే బల్లులను గోడలు, గదుల నుండి దూరంగా ఉంచుతుంది. మీరు ఇంట్లో కూడా ఈ స్ప్రేని సిద్ధం చేసుకోవచ్చు. దీనికి ఎండుమిర్చి గ్రైండ్ చేసి నీళ్లలో కలపాలి. దీని తరువాత మీరు దానిని సీసాలో ఉంచి స్ప్రే చేయవచ్చు. స్ప్రే చేస్తే బల్లి పారిపోతుంది.
☛ చలికాలంలో చల్లటి గదుల్లో బల్లులు ఎక్కువగా కనిపించవు. ఎందుకంటే అవి వెచ్చని ప్రదేశాలను ఇష్టపడతాడు. అటువంటి పరిస్థితిలో మీరు గోడపై బల్లిని చూసినట్లయితే అక్కడ నీటిని కూడా చల్లుకోవచ్చు. బల్లులు ఆహారం కోసం వెతుకుతుంటాయి. ఇంట్లోని సింక్‌లో జంక్ ఫుడ్‌ను ఉంచవద్దు. ఏసీ సహాయంతో ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా బల్లులను గది నుండి తరిమికొట్టవచ్చు. ఇలా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఇంట్లో బల్లులు రాకుండా చేసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి