
నవంబర్ ప్రారంభంతో వివాహాల సీజన్ కూడా మొదలవుతుంది.. ఈ సమయంలో సాధారణంగానే మహిళలు తమ పట్టుచీరలు, ఆభరణాలు, అలంకరణ పట్ల ఎక్కువగా ఆందోళనపడుతుంటారు. ఈ క్రమంలోనే వివాహ సన్నాహాలు కొన్ని నెలల ముందు నుంచే మొదలుపెడతారు. చాలా మంది మహిళలు వివాహ వేడుకలో అందంగా కనిపించడానికి ఆరాటపడుతుంటారు. కొత్త బట్టలు, కొత్త నగలు కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ, ప్రస్తుతం పెరిగిపోయిన బంగారం ధరల కారణంగా కొత్త నగలు కొనడం కష్టమే. అందుకే ఎక్కువ మంది తమ పాత నగలకు మెరుగులు పెట్టిస్తుంటారు. మీరు కూడా మీ పాత నగలను ఇంట్లోనే మెరిసేలా చేసుకునేందుకు కొన్ని అద్భుతమై చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
కొంతకాలం తరువాత బంగారం, వెండి ఆభరణాలు వాటి అసలు మెరుపును కోల్పోతాయి. డల్‌గా మారి, వాటి అసలు మెరుపును కోల్పోతాయి. చాలా మంది వాటిని శుభ్రం చేసుకోవడానికి నగల దుకాణాలకు వెళ్తుంటారు. కానీ,ఇది ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. కాబట్టి, మీరు సులభమైన, చవకైన పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే, ఈ వార్త మీ కోసమే. ఈ రోజు మీ పాత ఆభరణాలను కొత్తవిలా మెరిసేలా చేయడంలో మీకు సహాయపడే కొన్ని సాధారణ ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. గోరువెచ్చని నీరు, సబ్బు:
ఇంట్లోనే మీ బంగారు, వెండి ఆభరణాలను పాలిష్ చేసుకోవటం ఇప్పుడు ఈజీ అవుతుంది. ఈ టిప్స్ పాటిస్తే మీ పాత బంగారు నగలు తిరిగి కొత్తవాటిలా మెరుస్తూ కనిపిస్తాయి. ఇందుకోసం సబ్బు, షాంపూను గోరువెచ్చని నీటితో కలపండి. మీ ఆభరణాలను ఈ ద్రావణంలో 10 నుండి 15 నిమిషాలు నానబెట్టాలి. తరువాత, మృదువైన వస్త్రం లేదా బ్రష్‌తో స్క్రబ్ చేసి శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇది మీ బంగారు, వెండి నగలను మెరిసేలా చేస్తుంది.
2. పసుపు, టూత్‌పేస్ట్:
మీ బంగారు, వెండి ఆభరణాలను మెరిసేలా చేయడానికి మీరు పసుపు, టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. ఇందుకోసం టూత్‌పేస్ట్‌తో కొద్దిగా పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని బ్రష్‌కు అప్లై చేసి, ఆభరణాలను సున్నితంగా స్క్రబ్ చేయండి. కొద్దిసేపటి తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది ఆభరణాల మెరుపును తిరిగి తీసుకువస్తుంది.
3. వెనిగర్, నీరు:
బంగారు, వెండి ఆభరణాల మెరుపును తీసుకు వచ్చేందుకు మీరు వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. అర కప్పు వెనిగర్‌ను అర కప్పు నీటితో కలపండి. మీ ఆభరణాలను ఈ ద్రావణంలో 10 నుండి 15 నిమిషాలు నానబెట్టండి. మృదువైన బ్రష్‌తో సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇది మీ ఆభరణాలను మెరిసేలా చేస్తుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..