AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Woman: సంకల్పం ముందు సమస్యలన్నీ చిన్నవే.. ఒక్కేసారి మూడు ఉద్యోగాలతో గృహిణి హ్యాట్రిక్!

జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది ఓ గృహిణి. పెళ్ళై పిల్లలు ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పట్టుబట్టి చదవుపై దృష్టి పెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిందీ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ.

Inspiring Woman: సంకల్పం ముందు సమస్యలన్నీ చిన్నవే.. ఒక్కేసారి మూడు ఉద్యోగాలతో గృహిణి హ్యాట్రిక్!
Nirosha
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 03, 2024 | 10:21 AM

Share

జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది ఓ గృహిణి. పెళ్ళై పిల్లలు ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పట్టుబట్టి చదవుపై దృష్టి పెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిందీ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ.

ఇంటర్ సెకండియర్ లోనే మ్యారేజ్ అయ్యింది. అయిన ఆ తరువాత భర్త సహకారంతో ఓపెన్ యూనివర్సిటీలో చదువు కొనసాగించింది. BA (తెలుగు లిటరేచర్) పూర్తి చేసింది. అనంతరం MA (తెలుగు),TPT చేసి మూడుసార్లు తెలంగాణ టెట్ క్వాలిఫై అయ్యారు నిరోశా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దుండే నిరోశాకు ఇంటర్మీడియట్‌లో పెళ్లి జరిగింది. తరువాత కుటుంబ బాధ్యతలు పెరిగాయి. ఇద్దరు పిల్లలు జన్మించారు. రెగ్యులర్‌గా డిగ్రీ చేద్దామంటే కుటుంబ బాధ్యతలు అడ్డు వచ్చాయి. అయితే ఇంటి వద్దనే ఉండి.. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఇందుకు భర్త లక్ష్మణ్ పూర్తిగా సహకరించారు.

దీంతో ఆనుకున్న టార్గెట్ పూర్తి చేశారు. కేవలం అకడెమిక్ కాకుండా SET, UGC NET అర్హతలు సాధించి తన ప్రతిభను చాటారు. గత సంవత్సరం ఆగస్టులో గురుకుల బోర్డు నిర్వహించిన పరీక్షల ఫలితాల్లో ఏకంగా మూడు ఉద్యోగాలు సాదించి.. శెభాష్ అనిపించుకున్నారు. PGT, TGT టీచర్ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ కొలువులను తన టాలెంట్‌‌తో ఓపెన్ కేటగిరిలో సాధించారు. అటు ఉద్యోగం, పిల్లలు, ఇల్లు చూసుకుంటూ ఎటువంటి కోచింగ్ లేకుండానే ఈ మూడు కొలువులు సాదించారు. సంకల్పం ముందు సమస్యలన్నీ చిన్నవని నిరూపించారు నిరోశా. ఒక్కేసారి మూడు ఉద్యోగాలు రావడం ఆనందంగా ఉందని అంటున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో.. ఇది సాధ్యమైందని చెబుతున్నారు. పట్టుదల ఉంటే, ఏదైనా సాధించవచ్చని నిరూపించారు నిరోషా. ప్రభుత్వ ఉద్యోగం సాధించిన నిరోషాకు కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..