Honeymoon: దంపతులకు అదిరిపోయే న్యూస్.. అక్కడ ప్రెగ్నెన్సీ వస్తే చాలు.. కళ్లు చెదిరే ఆఫర్స్ ఇస్తున్న హోటల్స్..

ప్రయాణంలో ఉన్నప్పుడు గర్భం దాల్చడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? టియెర్రా మాగ్నిఫికా అనే కంపెనీ అలాంటి ఆఫర్‌తోనే ముందుకు వచ్చింది. ప్రెగ్నెన్సీ కోసం హనీమూన్ వెళ్లే దంపతులకు అదిరిపోయే ఆఫర్స్ ఇస్తోంది కంపెనీ. కోస్టారికా నోసారా బీచ్‌లోని ఒక హోటల్..

Honeymoon: దంపతులకు అదిరిపోయే న్యూస్.. అక్కడ ప్రెగ్నెన్సీ వస్తే చాలు.. కళ్లు చెదిరే ఆఫర్స్ ఇస్తున్న హోటల్స్..
Honeymoon

Updated on: Mar 29, 2023 | 8:21 AM

ప్రయాణంలో ఉన్నప్పుడు గర్భం దాల్చడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? టియెర్రా మాగ్నిఫికా అనే కంపెనీ అలాంటి ఆఫర్‌తోనే ముందుకు వచ్చింది. ప్రెగ్నెన్సీ కోసం హనీమూన్ వెళ్లే దంపతులకు అదిరిపోయే ఆఫర్స్ ఇస్తోంది కంపెనీ. కోస్టారికా నోసారా బీచ్‌లోని ఒక హోటల్ లగ్జరీ హిల్‌టాప్ బోటిక్ గర్భం దాల్చడానికి ఇక్కడకు వచ్చే జంటలకు రాత్రి ఉచిత బస, వెకేషన్ ఆఫర్‌లను అందిస్తోంది.

ఇక్కడకు వచ్చిన జంటలో భార్య గర్భవతి అయితే, 9 నెలల తర్వాత వారు ఇక్కడ ఉచితంగా రాత్రి బస చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు.. పోస్ట్ బేబీ వెకేషన్‌లో 50 శాతం తగ్గింపు కూడా ఇస్తోంది. అయితే, ఈ ఆకర్షణీయమైన ఆఫర్ కోసం రిసార్ట్ విధించిన కొన్ని షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. ఈ డీల్‌కి కంపెనీ స్పెషల్ డెలివరీ ప్యాకేజీ అని పేరు పెట్టింది.

టియెర్రా మాగ్నిఫికా యజమాని స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ.. ‘ఆఫర్‌లో భాగంగా హనీమూన్‌కి వెళ్లిన మూడు జంటలు పెగ్నెన్సీ న్యూస్‌తో తిరిగి వచ్చారు. ఇదో విభిన్నమైన ఆఫర్.’ అని పేర్కొన్నారు. అయితే, ఈ ఆఫర్ యూఎస్, కెనడా, యూకీ, యూరప్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కోస్టారికాలో నోసరా ఆకర్షణీయమైన బీచ్. ఇక్కడికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. వన్యప్రాణుల వీక్షణ ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. హోటల్ పరిసరాల్లో అద్భుతంగా ఉంటాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..