AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2021: కరోనా వేళ హోళీ పండుగ.. ఈ జాగ్రత్తలు పాటించండి.. సురక్షితంగా ఉండండి..

Holi 2021: హోళీ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఏటా వసంత మాసంలో వచ్చే ఈ రంగుల...

Holi 2021: కరోనా వేళ హోళీ పండుగ.. ఈ జాగ్రత్తలు పాటించండి.. సురక్షితంగా ఉండండి..
Holi
Shiva Prajapati
|

Updated on: Mar 29, 2021 | 11:25 AM

Share

Holi 2021: హోళీ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఏటా వసంత మాసంలో వచ్చే ఈ రంగుల పండుగను.. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులతో, రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటుంటారు. అయితే దేశ వ్యాప్తంగా హోళీ పండుగను ఒక్కో ఒక్కోరకంగా జరుపుకుంటారు. ప్రజలు తమ తమ ఆచార వ్యవహాలు, సంప్రదాయం ప్రకారం పండుగను చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే.. హోళీ పండుగలో కొత్త దోరణలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. గతంలో సహజసిద్ధమైన రంగులతోనే హోళీని ప్రజలు జరుపుకునే వారు. కానీ, ఇప్పుడు అంతా కెమికల్ మయం అవుతోంది. కెమికల్స్‌తో తయారు చేసిన రంగుల వాడకం విపరీతంగా పెరిగింది. ఈ మధ్య కాలంలో కెమికల్స్‌తో తయారు చేసిన రంగుల వాడకం ఎక్కువ అవుతోందని, వాటిని ఉపయోగించడం వలన మనుషుల ఆరోగ్యంతో పాటు.. పర్యావరణానికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సురిక్షతంగా హోళీ పండుగను జరుపుకునేందుకు నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రంగుల పండుగ జాగ్రత్తలివే.. సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను మాత్రమే వాడాలి. న్యాచురల్ కలర్స్ వల్ల చర్మానికి హానీ కలగదు. పైగా సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. కృత్రిమ రంగులకు దాదాపుగా దూరంగా ఉండండి. ఈ కలర్స్‌ చాలా ప్రమాదకరం. చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. పైగా ఈ రంగులు పోవాలంటే చాలా రోజుల సమయం పడుతుంది. హోళీ అడే సమయంలో శరీరం మొత్తం కవర్ అయ్యే దుస్తులు ధరించండి. అలా చేయడం ద్వారా రంగులు శరీరంపై పడకుండా ఉంటాయి. ఇక కళ్లకు రక్షణగా అద్దాలు పెట్టుకుంటే చాలా మంచింది. అద్దాలు ధరించడం వల్ల రంగులు కళ్లలో పడుకుండా.. రక్షణ ఉంటాయి. హోళీ అడడానికి సిద్ధమయ్యే ముందు పెట్రోలియం జెల్లీ, ఇతర మాయిశ్చరైజర్ క్రీములను శరీరానికి అప్లై చేసుకోండి. అలా చేయడం వల్ల రంగులు శరీరంపై పడినా.. పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. హోళీ అడుతున్న సమయంలో రంగులు నోట్లోకి వెళ్లినట్లయితే.. తక్షణమే నోటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే కళ్లలో రంగులు పడినా నీళ్లతో బాగా కడగాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. కళ్లలో రంగుపడితే రుద్దడం వంటివి చేయకూడదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హోళీకి దాదాపుగా దూరంగా ఉంటేనే క్షేమం. ఇంట్లో వారితో హోళీని జరుపుకుంటే బెటర్.

Also read:

ఈ లోహం బంగారం కంటే మూడు రెట్లు ఎక్కువ విలువైనది..! ప్లాటీనం కాదు..! బిట్‌కాయిన్‌ను మించిపోయింది..!

Guns seized: వికరాబాద్‌లో నాటు తుపాకుల కలకలం.. 10 మంది అరెస్టు, నాలుగు నాటు తుపాకులు, 9 మొబైళ్లు, 5 బైక్‌లు స్వాధీనం

Google Chrome: ఇంటర్నెట్ యూజర్స్‌.. గూగుల్ క్రోమ్‌లో ఉన్న ఈ ఫీచర్స్ మీకు తెలుసా?.. ఒక్కసారి చూశారంటే..