ఇది వైద్య శాస్త్రంలోనే అద్భుతం.. గుండె ఎడమ ప్రక్కనే ఉంటుందనేది అందరికీ తెలిసిందే..! అయితే కుడి ప్రక్కన గుండె ఉండటమే కాకుండా శరీరంలోని అవయవాలు కూడా వ్యతిరేక దిశలో ఉన్న యువతికి అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేశారు గుంటూరు వైద్యులు..
పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లింగంగుంట్లకు చెందిన మేరి, ఓంకారయ్య దంపతులకు ఎస్తేరు రాణి అనే కుమార్తె ఉంది. ఆమె మయస్సు పదహారు ఏళ్లు. కొద్దీ రోజుల క్రితం తీవ్ర కడునొప్పితో బాధపడుతూ శ్రీ ప్రతిమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లకు ఆమెకు గుండె ఎడమ వైపున కాకుండా కుడి వైపున ఉన్నట్లు గుర్తించారు. ఇతర అవయవాలు కూడా వ్యతిరేక దిశలో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే ఆమె కడుపునొప్పికి పాంక్రియాస్ లో సమస్య ఉన్నట్లు డాక్టర్ సాయి క్రిష్ణ చెప్పారు. అందుకు అవసరమైన చికిత్స అందించారు. కోలుకున్న కొద్దీ రోజుల తర్వాత తిరిగి కడునొప్పి రావడం ప్రారంభించింది.
దీంతో మరోసారి డాక్టర్ సాయి క్రిష్ణను ఆ బాలిక తల్లిదండ్రులు సంప్రదించారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం పసరుతిత్తిలో రాళ్లుండి అవి కిందకు జారడంతో సమస్య ఉన్నట్లు కనుగొన్నామన్నారు. దీంతో వెంటనే ఎండోస్కోపి విధానం ద్వారా లివర్‌కు స్టంట్ వేసి బాలికకు ఇబ్బంది లేకుండా వైద్యం అందించినట్లు ఆయన తెలిపారు. అయితే ఖరీదైన వైద్యం కేవలం పెద్ద పెద్ద సిటీస్ లోనే అందుబాటులో ఉంటుందని తాము మాత్రం ఆరోగ్య శ్రీ కింద బాలికకు అరుదైన వైద్యాన్ని అందించినట్లు ఆయన చెప్పారు.
బాలిక పూర్తిగా కోలుకోవడతో ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. అత్యంత అరదైన వైద్యాన్ని గుంటూరు సిటీలో ఉచితంగానే అందించి బాలిక ప్రాణాలు కాపాడిన వైద్యులను పలువురు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి