
జంతువులు, మానవుల మధ్య సంబంధం చాలా మధురంగా ఉంటుంది. మానవులు తమ పెంపుడు జంతువులపై, జంతువులు వాటి యజమానులపై అపారమైన ప్రేమ చూపించిన ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. జంతువులతో ఉంటే మానసిక స్వాంతన ఉంటుందని, అవి కల్మషం లేని ప్రేమని చూపిస్తాయని చాలామంది చెబుతారు. కాగా తన ఇంటి పాడి పశువులను అలరింకరించడానికి నగలు చేయించిన వ్యక్తుల్ని ఎప్పుడైనా చూశాారా? గుజరాత్‌కి చెందిన అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాం.
గుజరాత్ నివాసి అయిన విజయ్ పార్సనా తన ఆవును, దూడను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో వాటి కోసం నగలు తయారు చేయాలని అనుకున్నాడు. ఈ ఆభరణాలు ఏమి రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ కాదండి. బంగారు, వెండి రత్నాలతో చేసినవి. ఇందుకోసం ఏబి జ్యువెలర్స్ యజమాని మనోజ్ సోనితో మాట్లాడాడు. మనోజ్ నగలు తయారు చేయడానికి అంగీకరించాడు కాని దానికి పెద్ద షరతు పెట్టాడు. విజయ్ తన ఆవును షోరూంకు తీసుకువచ్చినప్పుడే ఆభరణాలు ఇస్తానని చెప్పాడు.
ఈ షరతు అంగీకరించిన విజయ్ నగలు తయారైన అనంతరం, తన ఆవును, దూడను తీసుకొని షో రూమ్‌కి చేరుకున్నాడు. అక్కడ మనోజ్ సోని ఆవును అలంకరించడమే కాదు, గోమాతమై తనకున్న ప్రేమను కూడా ప్రదర్శించాడు. ఆవు-దూడపై పూల వర్షం కురిపించాడు. ఈ సమయంలో విజయ్ కుటుంబంతో పాటు, షో రూమ్ సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. పెళ్లి మండపంలా షో రూం మొత్తం పూలతో అలంకరించారు. వాటిని బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించిన అనంతరం ఆవు, దూడలకు పండ్లను తినిపించి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, ప్రజలు విజయ్ జంతు ప్రేమను, మనోజ్ ఔదార్యాన్ని అభినందిస్తున్నారు. ఈ మొత్తం వేడుక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read:
AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు
Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్…