AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: ఇంట్లో మైక్రోవేవ్‌ ఓవెన్‌ ఉందా.? ఈ పొరపాట్లు చేస్తున్నారా..

ఆహారాన్ని త్వరగా వేడి చేసుకోవడంతో పాటు రకరకాల ఫుడ్స్‌ను తయారు చేసుకోవడానికి వీటిని ఉయోగిస్తున్నారు. ఈ కామర్స్‌ సైట్స్‌లో భారీగా ఆఫర్లు ప్రకటిస్తుండడంతో కూడా మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే మనలో చాలా మంది మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ వాడే విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇంతకీ మౌక్రోవేవ్‌ ఓవెన్స్‌ను ఉపయోగించే సమయంలో చేసే ఆ తప్పులు ఏంటి.?

Kitchen Tips: ఇంట్లో మైక్రోవేవ్‌ ఓవెన్‌ ఉందా.? ఈ పొరపాట్లు చేస్తున్నారా..
Microwave Oven
Narender Vaitla
|

Updated on: Nov 29, 2023 | 11:26 PM

Share

ఒకప్పుడు మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ అంటే కేవలం హోటల్స్‌, బేకరీల్లో మాత్రమే చూశే వాళ్లం. కానీ ఆ తర్వాత డబ్బున్న వాళ్ల ఇళ్లలో కనిపించేశావి. కానీ తర్వాత రోజులు మారాయి మధ్య తరగతి కుటుంబాల్లో కూడా మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ ధర భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో చాలా మంది ఓవెన్స్‌ను ఉపయోగిస్తున్నారు.

ఆహారాన్ని త్వరగా వేడి చేసుకోవడంతో పాటు రకరకాల ఫుడ్స్‌ను తయారు చేసుకోవడానికి వీటిని ఉయోగిస్తున్నారు. ఈ కామర్స్‌ సైట్స్‌లో భారీగా ఆఫర్లు ప్రకటిస్తుండడంతో కూడా మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే మనలో చాలా మంది మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ వాడే విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇంతకీ మౌక్రోవేవ్‌ ఓవెన్స్‌ను ఉపయోగించే సమయంలో చేసే ఆ తప్పులు ఏంటి.? వాటి వల్ల కలిగే నష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కొంతమంది ఓవెన్స్‌ను నీటితో కడుగుతుంటారు. అయితే ఇలా చేస్తే అవి త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పొడి బట్టతో తుడవాలి తప్ప కడగకూడదు.

* ఇక ఓవెన్‌ ఒకసారి ఉపయోగించిన తర్వాత వెంటనే మళ్లీ ఉపయోగించకూడదు. అలా ఉపయోగించాల్సి వస్తే కనీసం పది నిమిషాల పాటు చల్లార్చిన తర్వాత మళ్లీ ఆన్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల మైక్రోవేవ్‌ ఓవెన్‌పై ఒత్తిడి పడదు.

* మైక్రోవేవ్‌ను ఆన్‌ చేసిన వెంటనే ఆహార పదార్థాలు పెట్టకూడదు. ఆన్‌ ఏచసి 5 నిమిషాల తర్వాతే ఓవెన్‌ను ఆన్‌ చేయాలి. అలాగే స్విచ్‌ ఆఫ్‌ చేసిన రెండు నిమిషాల తర్వాతే ఓవెన్‌లో చేయి పెట్టాలి.

* ఇక మనలో చాలా మంది ఓవెన్‌లో ఉంచిన ఆహార పదార్థాలు వేడెక్కాయా, ఉడుకుతన్నాయా లేదా అని తెలుసుకునేందుకు మాటిమాటికీ ఓవెన్‌ మూత తెరస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల ఓవెన్ పనితీరు దెబ్బతింటుంది.

* ఓవెన్‌ వేడగా ఉన్న సమయంలో బలవంతంగా తెరవకూడదు. ఇలా చేయడం వల్ల ఓవెన్‌ పాడయ్యే అవకాశం ఉంటుంది. చల్లారిన తర్వాతే ఓపెన్‌ చేయాలి.

* ఇక ఓవెన్‌లు సహజంగానే ఎక్కువగా కరెంట్‌ను వాడుకుంటాయి కాబట్టి. కరెంట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితంగా 3 ఫేస్‌ కరెంట్ ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..