Horoscope Today: వారు ఒకటి రెండు శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..

దిన ఫలాలు (నవంబర్ 30, 2023): మేష రాశి వారికి రోజంతా మీ ఇష్ట ప్రకారమే సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. మిథునం ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి కానీ, సహోద్యోగుల వల్ల ఇబ్బందులుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారు ఒకటి రెండు శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..
Horoscope Today 30th November 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2023 | 7:41 AM

దిన ఫలాలు (నవంబర్ 30, 2023): మేష రాశి వారికి రోజంతా మీ ఇష్ట ప్రకారమే సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. మిథునం ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి కానీ, సహోద్యోగుల వల్ల ఇబ్బందులుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా మీ ఇష్ట ప్రకారమే సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బిజీగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల అండ లభిస్తుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిం చాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులకు సమయం అను కూలంగా ఉంది. కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రోజువారీ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు కూడా ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిదానంగా సాగు తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి కానీ, సహోద్యోగుల వల్ల ఇబ్బందులుంటాయి. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఖర్చులు అదుపు తప్పుతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల వాతావరణం కనిపిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజి కంగా కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజన కంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు చేరువవుతారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా మంచి ఫలితాలుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సమీప బంధువులకు సంబంధించి ఒక దుర్వార్త వినడం జరుగుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అన్ని రకాలుగానూ ఒత్తిడి, శ్రమ ఉంటాయి. విశ్రాంతి బాగా తగ్గుతుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపా రాల్లో లాభాలు పెరగవచ్చు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులు ఆశిం చిన ఫలితాలు సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆరోగ్యం పరవాలేదు. వృత్తి, ఉద్యోగాల్లో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు వల్ల ఆశిం చిన ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొద్దిగా వ్యయ ప్రయా సలు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పను లను ఎంతో శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మొండి బాకీలను వసూలు చేసుకుం టారు. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచుతారు. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగి స్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకుని ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రేమ భాగస్వామితో సరదాగా గడుపుతారు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యయ ప్రయాసలు కూడా ఎక్కువగా ఉంటాయి. రోజువారీ కార్య క్రమాలను, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలలో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగానే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో కూడా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు నిదానంగా సాగు తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి కానీ, వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. జాగ్రత్తగా ఉన్నప్పటికీ అదనపు ఖర్చులు తప్పకపోవచ్చు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా రొటీన్ గా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడికి ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగంలో మార్పునకు అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలి స్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. మిత్రుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.