Smelly Shoes: నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాకాలం ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. వర్షాకాలంలో సహజంగానే వాతావరణం తేమగా ఉంటుంది. ఇక ఈ సమయంలో పాదల చెమట, వర్షంలో తడిసిన కారణంగా బూట్లు, లేదా షూస్ కూడా తడుస్తాయి. అయితే వాటికి పట్టిన తడి వెంటనే ఆరిపోదు, పైగా వాటి నుంచి దుర్వాసన వస్తుంది. వాటిని అలాగే వేసుకుంటే పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ కలిగే ప్రమాదం ఉంది. బూట్ల నుంచి వచ్చే దుర్వాసన కూడా విపరీతంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బూట్ల నుంచి వచ్చే దుర్వాసనను వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..
నిమ్మకాయ తొక్క: పాదాలకు పట్టిన చెమట కారణంగా బూట్ల నుంచి వచ్చే దుర్వాసన అంత తేలికగా వదలదు. ఇలాంటప్పుడే నిమ్మకాయ తొక్కను రాత్రి అంతా బూట్లలో ఉంచితే చాలు, అందులోని దుర్వాసన తొలగిపోతుంది. ఇందుకోసం మీరు నారింజ తొక్కలను కూడా ఉపయోగించవచ్చు.
వంట సోడా: బేకింగ్ సోడాకు తేమను త్వరగా గ్రహించే శక్తి ఉంది. ఇంకా దుర్వాసనను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. అందుకే బూట్లు తడిగా ఉంటే వాటిల్లో కొంచెం బేకింగ్ సోడా వేసి రాత్రి అంతా అలా ఉంచేయండి. ఉదయానికి మీ బూట్లు పొడిగా, దుర్వాసన రహితంగా ఉంటాయి.
న్యూస్ పేపర్: తడిగా, దుర్వాసనను వెదజల్లే బూట్లకు వార్తా పత్రికలను కూడా ఉపయోగించవచ్చు. అందుకోసం మీరు బూట్లలో న్యూస్ పేపర్‌ని వేసి రాత్రి అంతా ఉంచడి, ఉదయానికి తేమ, దుర్వాసన ఉండదు.
టాల్కమ్ పౌడర్: బూట్లలోని చెడు వాసనను తొలగించడానికి టాల్కమ్ పౌడర్ కూడా ఉత్తమమైనది. ఇది బూట్లలోని తడిని గ్రహించి, వాసనను అరికడుతుంది.
ఫ్రీజర్: బూట్ల నుంచి ఎక్కువ మొత్తంలో వాసన వస్తుంటే.. వాటిని ప్లాస్టిక్ సంచిలో చుట్టి రాత్రి అంతా ఫ్రీజర్‌లో ఉంచండి. ఇది బూట్లలోని ఫంగస్, బ్యాక్టీరియాలను చంపి దుర్వాసనను తొలగిస్తుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..