Telangana: ఎంతటి విషాదం.. తండ్రికి తలకొరివి పెట్టి, గుండెపోటుతో తనయుడు మృతి..!

| Edited By: Balaraju Goud

Aug 13, 2024 | 7:32 AM

తండ్రి హఠాన్మరణంతో తల్లడిల్లిపోయిన తనయుడి గుండె బరువెక్కింది. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కొద్దిసేపటికే తనయుడు కూడా గుండెపోటుతో తనువు చాలించాడు. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

Telangana: ఎంతటి విషాదం.. తండ్రికి తలకొరివి పెట్టి, గుండెపోటుతో తనయుడు మృతి..!
Died
Follow us on

తండ్రి హఠాన్మరణంతో తల్లడిల్లిపోయిన తనయుడి గుండె బరువెక్కింది. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కొద్దిసేపటికే తనయుడు కూడా గుండెపోటుతో తనువు చాలించాడు. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో జరిగింది.

పెద్దంపేట గ్రామానికి చెందిన పెద్ద లక్ష్మయ్య (62) అనే వ్యక్తి సోమవారం(ఆగస్ట్ 12) ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రి మృతితో తల్లడిల్లిపోయిన పెద్దకుమారుడు కృష్ణరాజు(30) రోదిస్తూనే తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. సాయంత్రం తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడు కృష్ణరాజు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోడం ఇబ్బందిగా ఉండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కృష్ణరాజు గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగి కన్నీరుమున్నీరైంది. మృతులు ఇద్దరు వ్యవసాయ కూలీలుగా పని చేస్తు జీవిస్తుంటారు. తండ్రికొడుకుల మృత్యువాతతో పెద్దంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటు తో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయేలా చేసింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..