Election Result: పోటిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే..?

ఎన్నికల ప్రక్రియ నియమ నిబంధనల ప్రకారమే జరుగుతోంది. అందులో సందేహమే లేదు. ఐతే కొన్నిసార్లు కౌంటింగ్‌లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. జరిగాయి. ఐదారు ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన్నవాళ్లూ ఉన్నారు. మరి బరిలో వున్న ఇద్దరు అభ్యర్థులకు చెరి సమంగా ఓట్లు పోలయితే అప్పుడేం చేస్తారు. మళ్లీ ఎన్నిక నిర్వహిస్తారా?

Election Result: పోటిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే..?
Election Results

Updated on: Jun 01, 2024 | 3:08 PM

ఓటు ..ప్రతీ ఒక్కరి హక్కు. ఫలితాల్లో  ప్రతీ ఓటు కీలకమే. కొన్ని సార్లు  ఒక్క ఓటు ఒకే ఒక్క ఓటు  ఫలితాలను తారు మారు చేసిన సందర్భాలు వున్నాయి.  గతంలో  బ్యాలెట్‌ పేపర్‌ సిస్టమ్‌లో చెల్లిన ఓట్లు చెల్లని ఓట్లు అనే లెక్క ఉండేది.  కానీ ఈవీఎంలు వచ్చాక అలాంటి లొల్లి లేదు. వేసిన ఓటు అనుకున్న గుర్తుకే  పడిందా ? లేదా ? చెక్‌ చెస్కోవడానికి వీవీ ప్యాట్లున్నాయి. ఫలితాల ప్రకటనలో వీవీ ప్యాట్లే ఇవే కీలకం .

ఈవీఎంల  కౌంటింగ్‌ పూర్తవ్వగానే రిజల్ట్స్‌ను ప్రకటించారు. వీవీ ప్యాట్లను కూడా లెక్కిస్తారు. ఆ లెక్క ఈవీఎం కౌంటింగ్‌ కు సరిపోయిందా లేదా  చెక్‌ చేస్తారు. ఇన్‌ జనరల్‌గా ఎవరికి ఎక్కువ  ఓట్లు వచ్చాయో వాళ్లే గెలిచినట్టుగా ప్రకటిస్తారు. మరి ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు  సమానంగా పోలయితే? అలా జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇద్దరికి సమంగా ఓట్లు   వచ్చినప్పుడు  ఆయా అభ్యర్థులు, కౌంటింగ్‌  ఏజెంట్ల సమక్షంలో మళ్లీ ఓట్లను లెక్కిస్తారు. రీ-కౌంటింగ్‌లో  కూడా  అదే రిజల్ట్‌ రిపీటయితే  ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం నిర్ణయం తీసుకోబడుతుంది. ఆ నిర్ణయమే..లాటరీ. ఇద్దరు అభ్యర్థుల పేర్లను చీటీలపై రాస్తారు. వాటిని ఓ బాక్స్‌లో వేసి బాగా కదుపుతారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఒక స్లిప్‌ను తీస్తారు. అందులో ఎవరి పేరు వస్తే వారినే  విజేతగా ప్రకటిస్తారు. చీటిని అదనపు ఓటుగా పరిగణిస్తారన్నమాట. ఇదంతా పారదర్శకంగా జరుగుతోంది.

మరి నోటా  మాటేంటి….

బరిలో ఉన్న అభ్యర్థులు , వాళ్ల అజెండా నచ్చని ఓటర్లు.. తమ ఓటు హక్కును  వినియోగించుకునేలా  2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలా వచ్చిందే None Of The Above ..నోటా..ఆప్షన్‌. ఈవీఎంలో అన్నిటికన్నా చివరన ఉండే బటన్‌.. నోటా.  అభ్యర్థులు, వారి అజెండా నచ్చని వాళ్లు నోటాకు ఓటేస్తారు. నోటాకు పడిన ఓట్లను అదనపు ఓట్లుగా పరిగణిస్తారు. ఒకవేళ బరిలో వున్న అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ పోలైతే…! అలాంటి సందర్భం దాదాపుగా ఉండదు.కానీ ప్రతీది సంభవమే కదా. ఒకవేళ అలాంటి సందర్భం వస్తే అప్పుడేం చేస్తారు? ఫర్‌ ఎగ్జాంపుల్‌   100 ఓట్లలో 99 నోటాకుపడి.. ఒక అభ్యర్థికి ఒక ఓటు వస్తే.. ఆ అభ్యర్థినే విజేత.

ఓ నియోజకవర్గంలో  బరిలో ఉన్న అభ్యర్థులందరీ డిపాజిట్లు గల్లంతైతే.. దానికీ ఓ మార్గం ఉంది. అలాంటి సందర్భల్లో   ఎలక్షన్‌ రూల్‌ ప్రకారం  ఎవరికి ఎక్కువ ఓట్లు  వస్తే వాళ్లే గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఇవన్నీ ఎందుకంటే… మళ్లీ ఎలక్షన్‌ నిర్వహించాలంటే ఖర్చు తడిసి మోపడవుతుంది. ప్రజలకూ ఇబ్బందే. సో..ఆర్ధిక భారం రాకుండా ఎన్నికల సంఘం నియమ నిబంధనల్లో ఇలాంటి ప్రొవిజన్స్‌ పొందుపరిచారు. ఇద్దరికీ  చెరి  సమానంగా ఓట్లు వచ్చిన ఘటనల్లో గతంలో కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. రీకౌంటింగ్‌లో కూడా అదే ఫలితం రిపీట్‌ కావడంతో  లక్కీ డ్రా తీశారు. అప్పటి నుంచి అదే సిస్టమ్‌ కంటిన్యూ అవుతోంది. ఎన్నికల ఫలితాల్లో ప్రతీది సంభవమే. అలాగే క్లిష్టం అనుకన్న ప్రతీ సమస్యకు పరిష్కారం  ఉంది కూడా.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…