Livable Cities: కరోనా మహమ్మారి ఒక ప్రాంతం, దేశం అనే తేడా లేకుండా యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. మానవ సమాజాన్ని మొత్తం షేక్ చేసిందీ మాయదారి రోగం. ప్రపంచంలో అగ్రదేశంగా నిలిచిన అమెరికాలాంటి దేశాలు కూడా కంటికి కనిపించని ఓ వైరస్ కారణంగా చిగురుటాకులా వణికిపోయాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అన్నింటిని చిన్నాభిన్నం చేసిన కరోనా.. నివాసయోగ్యమైన నగరాలను సైతం మార్చేసింది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని కొన్నినగరాలు నివాసయోగ్యమైన నగరాలు తమ స్థానాన్ని కోల్పోయినట్లు ‘ది ఎకానమిస్ట్’ వార్షిక సర్వే వెల్లడించింది. కరోనా కారణంగా ఐరోపా దేశాల్లోని కొన్ని నగరాలు.. వాటి నివాసయోగ్యతను కోల్పోయినట్లు సర్వే తెలిపింది. ఈ జాబితాలో ప్రతీసారి ముందుండే.. ఐరోపా నగరాలన్నీ ఈసారి తమ స్థానాల్ని కోల్పోయాయి. ఇక కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్‌లోని మహానగరాలు ఈ సారి ఈ జాబితాలో ముందునిలవడం విశేషం. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. ఇక జపాన్‌లోని ఒసాకా, ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్, మెల్‌బోర్న్, బ్రిస్బేన్, పెర్త్ న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్, జపాన్‌లోని టోక్యో, స్విట్జర్లాండ్‌లోని జెనీవా జాబితాలో తొలి పదిస్థానాల్లో నిలిచాయి. పదింటిలో ఆరు ఆస్ట్రేలియాలోని నగరాలే కావడం విశేషం.
కోవిద్ రోగుల మృతదేహాలను పడేయడానికి ముంబైలో నది లేదు…..మేయర్ ఖండన ..కానీ …..