భోజన ప్రియులకు గుడ్‏న్యూస్.. బంగారంతో బిర్యానీ వడ్డిస్తున్న రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..

|

Feb 25, 2021 | 1:35 PM

ఇప్పటి వరకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ లేదా వెజ్ బిర్యానీ ఇవే మనకు తెలిసినవి. ఇటీవలే సోషల్ మీడియాలో

భోజన ప్రియులకు గుడ్‏న్యూస్.. బంగారంతో బిర్యానీ వడ్డిస్తున్న రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..
Follow us on

Dubai Restaurant Serves Gold Biryani: ఇప్పటి వరకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ లేదా వెజ్ బిర్యానీ ఇవే మనకు తెలిసినవి. ఇటీవలే సోషల్ మీడియాలో స్ట్రాబెరీ బిర్యానీ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా బంగారం బిర్యానీ వచ్చింది. అవును మీరు చదువుతున్నది నిజమే.. బంగారంతో బిర్యానీ. అచ్చంగా 23 క్యారెట్లతో బంగారు బిర్యానీని వడ్డిస్తుంది ఓ రెస్టారెంట్. దీంతో ఆ రెస్టారెంట్‏ ముందు భోజన ప్రియులే కాదండోయ్.. శాకహారులు కూడా క్యూలు కడుతున్నారు. మీరు ఆ రెస్టారెంట్‏కు వెళ్ళనుకుంటున్నారా ? అయితే మీరు దుబాయ్ వెళ్ళాల్సిందే. బంగారం బిర్యానీ కోసం దుబాయ్ వరకు ఎందుకు అనుకుంటున్నారా.. ఈ బిర్యానీని వడ్డిస్తుంది దుబాయ్ దేశంలోని ఓ రెస్టారెంటే మరి.

బిర్యానీ భారతీయ వంటకాల్లో ఒకటి. ప్రతి ఒక్కరు ఇష్టపడే వంటకం. అయితే రోజూ తినే బిర్యానీ కాకుండా సరికొత్త బిర్యానీని మీకు అందిస్తుంది ఓ రెస్టారెంట్. అందుకు కేవలం రూ.20,000 చెల్లిస్తే సరిపోతుంది. కానీ అందుకోసం మీరు దుబాయ్ వెళ్లాల్సిందే ఇక.

దుబాయ్‏లో ఒక రెస్టారెంట్ తమ కస్టమర్లకు బంగారపు బిర్యానీని వడ్డిస్తుంది. ఒక పెద్ద పల్లెంలో దాదాపు 23 క్యారెట్ల బంగారు ఆకులతో అలంకరించి మరీ వడ్డిస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (డీఐఎఫ్సీ)లో బొంబాయి బోరో అనే రెస్టారెంట్ ఇటీవల రాయల్ గోల్డ్ బిర్యానీ అనే ప్రత్యేక బిర్యానీ ప్లేట్‏ను ప్రారంభించింది. వివరాళ్ళోకెలితే.. బిర్యానీని ఒక పెద్ద బంగారు పల్లెంలో వడ్డిస్తారు. దాంతోపాటు 23 క్యారెట్ల బంగారు ఆకులను కూడా అలంకరిస్తారు. ఈ బిర్యానీ ప్లేట్ ధర దుబాయ్ రూపాయల ప్రకారం రూ.1000 అంటే దాదాపు ఒక్క ప్లేట్ ఖరీదు 20,000 అన్నమాట.

లగ్జరీ బ్రిటీష్ యుగపు భారతీయ రెస్టారెంట్ భారతీయ పేరుతో కుంకుమ ప్రేరీత బియ్యం బిర్యానీని కలిగి ఉన్న భారీ రాయల్ బిర్యానీ పల్లెంను అందిస్తుంది. ఇందులో వివిధ రకాల బంగారు ఆకు కబాబ్‏లను అలకరిస్తారు. మొఘలై కోఫ్తాస్, మలై చికెన్ రోస్ట్, సాస్, కూరలు, రైటాస్ అన్ని కలగలిపి దాని చుట్టూ అలంకరించి సర్వ్ చేస్తారు. ఇది రాయల్టీని అనుభవిస్తున్నామన్న ఉత్యహన్ని కలిగిస్తుంది. మీకు బంగారు బిర్యానీ కావాలా ? అయితే ఇప్పుడే బుక్ చేసుకోండి. ఆర్డర్ పెట్టగానే బిర్యానీ సిద్ధం చేయడానికి 45 నిమిషాలు పడుతుంది. మీకు జీవితకాలం గుర్తిండిపోయో భోజనాన్ని అందిస్తాం అంటూ ఆ రెస్టారెంట్ నిర్వహకులు తమ ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ బంగారు బిర్యానీ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Also Read:

నిద్రపోండి.. రూ. 10 లక్షలు సంపాదించండి.. ఈ ఉద్యోగానికి అందరూ అర్హులే.. వివరాలివే.!

తెలంగాణలో 1150 పోస్టాఫీస్ జాబ్స్.. దరఖాస్తులకు రేపే చివరితేదీ.. టెన్త్ పాసైనవారు అర్హులు..