Viral Video: డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రాణాపాయం.. వైరల్ అవుతున్న ఘాట్ రోడ్డు వీడియో

ముఖ్యంగా ఘాట్ రోడ్లల్లో మన వాహనం పక్కన మరో వాహనం వస్తే ప్రమాద పరిస్థితులు మరిన్ని ఎక్కువ అవుతాయి.  ఇరుకైన పర్వత రహదారుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ట్రక్కుతో ప్రమాదాన్ని తృటిలో తప్పిపోయిన వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతుంది. ఆ వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

Viral Video: డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రాణాపాయం.. వైరల్ అవుతున్న ఘాట్ రోడ్డు వీడియో
Viral Video

Updated on: Apr 09, 2024 | 4:46 PM

పర్వతాల పక్కన రోడ్లు అంటే ఘాట్ రోడ్లు. ఈ రోడ్లల్లో ప్రయాణం చాలా శ్రమతో కూడుకున్న పని. ఈ రోడ్లల్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా సంయమనంతో పాటు అలెర్ట్‌గా ఉండాలి. డ్రైవింగ్ సమయంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్ద ప్రమాదాలకు కారణం అవుతారు. ముఖ్యంగా ఘాట్ రోడ్లల్లో మన వాహనం పక్కన మరో వాహనం వస్తే ప్రమాద పరిస్థితులు మరిన్ని ఎక్కువ అవుతాయి.  ఇరుకైన పర్వత రహదారుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ట్రక్కుతో ప్రమాదాన్ని తృటిలో తప్పిపోయిన వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతుంది. ఆ వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

మాన్యువల్ ట్రాన్స్మిషన్ కారును ఉపయోగించడాన్ని సమర్థించే వీడియో ఇది. ఒక ఘాట్ రోడ్డు మీదుగా ఓ కారు వేగంగా వెళ్తుంది. అయితే ఆ రోడ్డుపై రైలింగ్ ప్రారంభం అవ్వడంతో డ్రైవర్ భయంగా అనిపిస్తూ నెమ్మదిగా వెళ్తున్నాడు. కొన్ని సెకన్ల తర్వాత రోడ్డు మీద మలుపులో నుంచి ఒక ట్రక్ కనిపిస్తుంది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేకులు వేశాడు. అయినా ట్రక్కు వేగంగా రావడంతో దాన్ని గుర్తించిన కారు డ్రైవర్ రివర్స్ మోడ్‌లో కారును వెనుకకు తీసుకెళ్తాడు. అదే సమయంలో ట్రక్కు డ్రైవర్ కూడా ట్రక్కు వేగాన్ని తగ్గిండంతో ప్రమాదం నుంచి బయటపడతారు. ఈ వీడియోను మీరు చూసేయండి..

ఇవి కూడా చదవండి


పర్వత రహదారులపై డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇలాంటి పరిస్థితులను నివారించవచ్చు. ఉదాహరణకు ఘాట్ రోడ్లపై డ్రైవింగ్ చేసే డ్రైవరల్ల రహదారిని స్పష్టంగా చూడటానికి వారి కార్ల నుండి బ్లైండ్ స్పాట్లను తొలగించవచ్చు. ఇంకా డ్రైవర్లు రాబోయే వాటి గురించి ఒక ఆలోచన కలిగి ఉండటానికి రహదారి చిహ్నాలపై శ్రద్ధ వహించాలి. డ్రైవర్లు కూడా రోడ్డు పక్కనే ఉండి అవసరమైతే తప్ప ఓవర్టేక్ చేయకుండా ఉండాలి. కొండ రోడ్లు చాలా అనూహ్యమైనవి, ప్రమాదకరమైనవి కాబట్టి వారు రహదారిపై దృష్టి కేంద్రీకరించాలి. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…