మహిళలు కాళ్లకు బంగారు పట్టీలు కాకుండా వెండి పట్టగొలుసులే ఎందుకు ధరిస్తారో తెలుసా..

|

Aug 19, 2021 | 12:35 PM

మహిళలు ధరించే కళ్ల కాటుక నుంచి బొట్టు, గాజులు, పట్టీలు ఇవన్నీ అందం కోసం మాత్రమే కాదు.. వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

మహిళలు కాళ్లకు బంగారు పట్టీలు కాకుండా వెండి పట్టగొలుసులే ఎందుకు ధరిస్తారో తెలుసా..
Silver Ancklets
Follow us on

మహిళలు ధరించే కళ్ల కాటుక నుంచి బొట్టు, గాజులు, పట్టీలు ఇవన్నీ అందం కోసం మాత్రమే కాదు.. వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలు బంగారు ఆభరణాలను ఎక్కువగా ధరిస్తుంటారు. ఆడపిల్ల అంటేనే అలంకారం. ఒంటినిండ నగలతో ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతున్నట్లుగా భావిస్తారు. అయితే బంగారు నగలను ఎంతో అందంగా ముస్తాబయ్యే అమ్మాయిలు మాత్రం కాళ్లకు వెండి పట్టీలను ధరిస్తారు. బంగారు పట్టీలు కాకుండా.. వెండి పట్టీలు మాత్రమే ధరిస్తారు. బంగారు కాళ్ల గజ్జెలు ఎందుకు ధరించరో తెలుసుకుందామా.

సాధారణంగా వెండి మానవ శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి వ‌స్తువులు ధ‌రిస్తే శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోతుందని అంటుంటారు. అందుకే పాదాల‌కు వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధరిస్తారు. మ‌హిళ‌లు పాదాల‌కు ప‌ట్టీలు ధ‌రించ‌డం అన్నది మ‌న భార‌తీయ సంప్రదాయాల్లో ఒక‌టి. మ‌న దేశంలో ఉన్న చాలా వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లు కాళ్లకు ప‌ట్టీల‌ను ధ‌రిస్తారు. మ‌హిళ‌లు వివాహం చేసుకున్న సంద‌ర్భంలో కాలివేళ్లకు మెట్టెలు తొడుగుతారు. అదే ప‌ట్టీలు అయితే ఆడ‌పిల్ల పుట్టగానే త‌ల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారి పాదాల‌కు ప‌ట్టీల‌ను వేస్తారు. పట్టీలు ధరించిన ఆడపిల్ల సాక్షాత్తు మహాలక్ష్మిగా భావిస్తారు. ఆ అమ్మవారు తమ ఇంట్లో కూతురి రూపంలో తిరుగుతుందని విశ్వసిస్తారు.

సాధార‌ణంగా హిందూ పురాణాల ప్రకారం.. బంగారం అంటే సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి అనే చెబుతారు. అలాగే ల‌క్ష్మీదేవికి ప‌సుపు రంగు అంటే చాలా ఇష్టమని. అందుకే బంగారంతో చేసే పట్టీలను కాళ్లకు ధరించకూడదని శాస్త్రం చెబుతుంది.

అలాగే సైన్స్ ప్రకారం వెండి శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి వ‌స్తువులు ధ‌రిస్తే శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోతుంది. వెండి ప‌ట్టీల‌ను ధ‌రిస్తే న‌డుం నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందట. నిత్యం రోజువారి పనులతో ఎక్కువగా మహిళలు అలసిపోకుండా ఉండటానికే.. వెండి గజ్జెలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యంగా, స్మూత్ గా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్తప్రసరణ సజావుగా జరగడానికి, పాదాలు వాపులు రాకుండా ఉండటానికి సహకరిస్తాయి.

Also Read: Fake Voter Cards: యూపీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్ ఓటర్ ఐడెంటిటీ కార్డుల జారీ.. పలువురి అరెస్ట్..

Varalakshmi Vratam: సంపదను స్వార్ధ బుద్ధితో కాక త్యాగబుద్ధితోనే అనుభవించాలని సుచించే గజలక్ష్మి.. ఏనుగులు ఎందుకుంటాయో తెలుసా

Viral Audio: రాజమండ్రి నుంచి 10 మందిని దించేస్తా.. ఖతం చేయిస్తా.. తోటి ఉద్యోగులను బెదిరించిన ఓ ప్రభుత్వ అధికారి ఆడియో వైరల్..