Car: వారాల తరబడి కారును బయటకు తీయడం లేదా.. ఏమవుతుందో తెలుసా.?

ప్రస్తుతం కారు వినియోగం భారీగా పెరిగింది. మధ్య తరగతికి చెందిన వారు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ కార్లు అందుబాటులోకి వస్తుండడం, బ్యాంకులు కూడా భారీగా ఆఫర్లు అందిస్తుండడంతో చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్లను ఉపయోగించే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది...

Car: వారాల తరబడి కారును బయటకు తీయడం లేదా.. ఏమవుతుందో తెలుసా.?
Car Care
Follow us

|

Updated on: Sep 08, 2024 | 5:49 PM

ప్రస్తుతం కారు వినియోగం భారీగా పెరిగింది. మధ్య తరగతికి చెందిన వారు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ కార్లు అందుబాటులోకి వస్తుండడం, బ్యాంకులు కూడా భారీగా ఆఫర్లు అందిస్తుండడంతో చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్లను ఉపయోగించే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనలో చాలా మంది కార్లతో పెద్దగా అవసరం లేకపోయే సరికి వారాలు గడిచినా బయటకు తీయరు. వారాలకు వారాలు అలాగే పార్క్‌ చేసి వదిలేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కారును ఎక్కువ కాలం బయటకు తీయకపోతే జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎక్కువకాలం కారు ఇంజన్‌ ఆన్‌ చేయకపోతే బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కారులో ఉండే వాచ్‌, చిన్న చిన్న లైట్స్‌ వల్ల బ్యాటరీ నెమ్మదిగా డిశ్చార్జ్‌ అవుతుంది. అందుకే అప్పుడప్పుడు కచ్చితంగా ఇంజన్‌ ఆన్‌ చేస్తుండాలి.

* ఇక వారాలపాటు ఒకే యాంగిల్‌లో కార్లను ఉంచడం వల్ల టైర్స్‌లో ఫ్లాట్ స్పాట్‌లు ఏర్పడే అవకావం ఉంటుంది. ఇది టైర్‌లో ఒత్తిడి తగ్గేందుకు కారణమవుతుంది. డ్రైవింగ్ చేసే సమయంలో ప్రమాదాలు జరిగేందుకు కారణమవుతుండొచ్చని అంటున్నారు.

* ఎక్కువ కాలం కారును అలాగే పార్క్‌ చేసి ఉండడం వల్ల బ్రేక్‌లు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి కారణం తేమగా ఉండే ప్రదేశంలో పార్క్ చేస్తే. బ్రేక్ ప్యాడ్స్‌, డిస్క్‌లు తప్పు ప్టటేందుకు కారణమవుతాయి. దీంతో బ్రేక్‌లు సరిగ్గా పనిచేయవు.

* కారును ఎక్కువసేపు పార్క్ చేసినట్లయితే, ఇంధన ట్యాంక్‌లో ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ చెడిపోతాయి. ఇది ఇంజన్‌లో సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. అలాగే ట్యాంక్‌ లోపల ఏర్పడే తేమ కారణంగా ఇంజన్‌ డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంటుది.

* కారును ఎక్కువకాలం బయటకు తీయకుండా ఉండే కారు ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో తేమ పేరుకుపోతుంది. ఇది తుప్పు పట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ఎగ్సాస్ట్ సిస్టమ్ తుప్పు పడుతుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

వీలైనంత వరకు కారును ఎక్కువ కాలం తీయకుండా ఉండకూడదు. కనీసం వారం రోజులకు ఒక్కసారైనా కారును స్టార్ట్‌ చేస్తుండాలి. కనీసం కొన్ని నిమిషాలైనా డ్రైవ్‌ చేయాలి. కారు టైర్‌లో గాలి ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. టైర్లను కొద్ది సేపైనా తిప్పాలి. ఇక మరీ ఎక్కువ కాలం కారును బయటకు తీయరని అనుకుంటే.. బ్యాటరీని డిస్‌నకెక్ట్ చేయొచ్చు. దీని వల్ల బ్యాటరీ డిశ్చార్జ్‌ అవ్వదు. ఇక కారును పార్క్‌ చేసే సమయంలో నీడ, నీరు లేని ప్రదేశంలో పార్క్‌ చేయాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అతి తక్కువ ధరకే బ్రాండెడ్ ట్యాబ్లెట్.. 65శాతం కంటే ఎక్కువ..
అతి తక్కువ ధరకే బ్రాండెడ్ ట్యాబ్లెట్.. 65శాతం కంటే ఎక్కువ..
ఉన్నది 5 వారాలే కానీ.. డబ్బులు మాత్రం భారీగానే పట్టేసింది.!
ఉన్నది 5 వారాలే కానీ.. డబ్బులు మాత్రం భారీగానే పట్టేసింది.!
పీవీఆర్‌ ఐనాక్స్‌, ఖుషీ అడ్వర్టైజింగ్‌తో కీలక ఒప్పందం..
పీవీఆర్‌ ఐనాక్స్‌, ఖుషీ అడ్వర్టైజింగ్‌తో కీలక ఒప్పందం..
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు..
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు..
దసరాకు ముందు పేదలకు గుడ్‌న్యూస్.. కేంద్రం మరో కీలక ప్రకటన
దసరాకు ముందు పేదలకు గుడ్‌న్యూస్.. కేంద్రం మరో కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌పై ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి ప్రశంసలు..
పవన్‌ కల్యాణ్‌పై ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి ప్రశంసలు..
బీపీని కంట్రోల్ చేసే బెస్ట్ డ్రింక్స్ ఇవే.. డోంట్ మిస్!
బీపీని కంట్రోల్ చేసే బెస్ట్ డ్రింక్స్ ఇవే.. డోంట్ మిస్!
రిచ్ లుక్‌లో మేడ్ ఇండియా ఈ-స్కూటర్.. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ
రిచ్ లుక్‌లో మేడ్ ఇండియా ఈ-స్కూటర్.. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ
బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పులు లేకుండా కిచ్చా సుదీప్..
బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పులు లేకుండా కిచ్చా సుదీప్..
జీవితంలో ఒక మనిషిని ఇలా ఎవరైనా ప్రేమించగలరా..? సాయి పల్లవి
జీవితంలో ఒక మనిషిని ఇలా ఎవరైనా ప్రేమించగలరా..? సాయి పల్లవి