Lifestyle: ఏంటీ లైఫ్.. అని బోర్‌గా ఫీలవుతున్నారా? ఈ పనులు చేయండి చాలు
ప్రతీ ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో బోర్ రావడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బిజీగా మారిపోయిన ప్రస్తుతం తరుణంలో ఈ భావన మరింత ఎక్కువవుతోంది. జీవితం అంటేనే ఓ రేస్‌లా మారిపోయింది. వృత్తి, ఆర్థిక పరమైన అంశాలే జీవితానికి అధిక ప్రాధాన్యతలుగా మారిపోయాయి...
ప్రతీ ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో బోర్ రావడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బిజీగా మారిపోయిన ప్రస్తుతం తరుణంలో ఈ భావన మరింత ఎక్కువవుతోంది. జీవితం అంటేనే ఓ రేస్‌లా మారిపోయింది. వృత్తి, ఆర్థిక పరమైన అంశాలే జీవితానికి అధిక ప్రాధాన్యతలుగా మారిపోయాయి. దీంతో సహజంగానే మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అయితే ఇలాంటి ఫీలింగ్ రాకుండా ఉండాలంటే. నెలలో కొన్ని రోజులు కొన్ని రకాల పనులు చేయాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* నెలలో కచ్చితంగా ఒక్కరోజైనా మీ ఇంట్లో పనులకు కేటాయించుకోవాలి. ముఖ్యంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కోసం లేదా ఇంట్లో ఏవైనా అలంకరణ వస్తువులను ఏర్పాటు చేయడం లాంటివి చేయాలి. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పని చేయడం వల్ల ఏదో తెలియని ఒక స్వయంతృప్తి కలుగుతుంది.
* నెలలో ఒక రోజును ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు. వంట రాని వారు వంట చేయడం, డ్యాన్స్ చేయడం, పెయింటింట్ ప్రాక్టీస్ చేయడం లాంటివి అలవాటు చేసుకోవాలి. వీలైతే ప్రతీ వారం ఒక రోజులో కొంత సమయాన్ని అయినా ఇందుకోసం కేటాయించాలి.
* ఎంత ఓటీటీలు, పెద్ద స్క్రీన్ టీవీలు అందుబాటులోకి వచ్చాయని ఎప్పటికీ ఇంట్లోనే కూర్చొకండి. నెలలో ఒక్కరోజైనా అలా బయటకు వెళ్లి సినిమా చూడాలని నిపుణులు చెబుతున్నారు. సినిమాలు నచ్చని వారు కచేరీలు, స్టాండ్ అప్ కామెడీ షో వంటివి వీక్షించవచ్చు.
* ఇక నెలలో ఒక్క రోజైనా మీరు స్నేహితులు లేదా మీ సన్నిహితులతో కలిసి భోజనం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. వీలైతే హోటల్‌కి వెళ్లి భోజనం చేయండి. లేదంటే స్నేహితులకు స్వయంగా మీరే వంట చేసి వడ్డించండి.
* మనసు రిఫ్రెష్ అవ్వడానికి నెలలో ఒక్క రోజైనా అలా రోడ్ ట్రిప్‌కి వెళ్లాలి. బైక్‌పై లాంగ్ డ్రైవ్ వెళ్లాలి. ఇలా చేయడం వల్ల రిలాక్స్ అవుతారు.
* ఒక మానసిక ప్రశాంతత లభించాలంటే వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అతిగా సోషల్ మీడియా వాడే వారిలో మానసిక సమస్యలు వస్తాయని అంటున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..