Milk: మీరు తాగుతోన్న పాలు.. కల్తీవా, మంచివా.? ఇలా తెలుసుకోండి..
సాధారణంగా స్వచ్ఛమైన పాలు -0.55 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడతాయి. ఒకవేళ ఈ ఉష్ణోగ్రత కాకుండా మరో ఉష్ణోగ్రతలో పాలు గడ్డకట్టాయంటే అందులో కచ్చితంగా నీరు కలిశాయని అర్థం చేసుకోవాలి. ఇక పాల నాణ్యతను ‘లాక్టోమీటరు’ సహాయంతో కూడా తెలుసుకోవచ్చు. ఈ పరికరంలో పాలు పోయగానే అందులో ‘కొవ్వు కాకుండా ఇతర ఘనపదార్థాలు’(ఎస్‌ఎన్‌ఎఫ్) ఎంత శాతం ఉన్నాయో తెలిసిపోతుంది...
ఉదయం లేవగానే పాలతోనే రోజును ప్రారంభిస్తుంటారు. కాఫీ, టీ ఇలా ఏది కావాలన్నా పాలు ఉండాల్సిందే. పిల్లల నుంచి పెద్దల వరకు కచ్చితంగా ప్రతీ రోజూ పాలు ఉండాల్సిందే. అయితే మనం ఆరోగ్యానికి మంచిదని తాగుతోన్న పాలను కొందరు కేటుగాళ్లు కల్తీగా మార్చేస్తున్నారు. అక్రమార్జన కోసం పాలను సైతం కల్తీ చేస్తున్నారు. ఏదో నీళ్లు కలుపుతున్నారనుకుంటే పొరబడినట్లే.. ఏకంగా కృత్రిమ పాలనే తయారు చేస్తున్నారు. గంజిపొడి, యూరి, డిటర్జెంట్ ఇలా రకరకాల పదార్థాలు కలిపి పాలను విషంగా మార్చేస్తున్నారు. అయితే మనం ఉపయోగిస్తున్న పాలు నిజంగా మంచివేనా.? లేదా కల్తీనా.? తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా స్వచ్ఛమైన పాలు -0.55 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడతాయి. ఒకవేళ ఈ ఉష్ణోగ్రత కాకుండా మరో ఉష్ణోగ్రతలో పాలు గడ్డకట్టాయంటే అందులో కచ్చితంగా నీరు కలిశాయని అర్థం చేసుకోవాలి. ఇక పాల నాణ్యతను ‘లాక్టోమీటరు’ సహాయంతో కూడా తెలుసుకోవచ్చు. ఈ పరికరంలో పాలు పోయగానే అందులో ‘కొవ్వు కాకుండా ఇతర ఘనపదార్థాలు’(ఎస్‌ఎన్‌ఎఫ్) ఎంత శాతం ఉన్నాయో తెలిసిపోతుంది.
ఇక పాలలో యూరియా కలిపారన్న విషయాన్ని వేడి చేసే సమయంలో తెలుసుకోవచ్చు. పాలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరిలో ఏర్పడే ఘనపు రేణువులు స్ఫటికాల రూపంలో ఘనీభవిస్తే అందులో యూరియా కలిపారని అర్థం చేసుకోవాలి. ఇక ఒక గ్లాసు తీసుకోని అందులో పాలు తీసుకోవాలి. అనంతరం అందులో కొంత నీరును కలిపి బాగా కలపాలి. ఒకవేళ పాలలో డిటెర్జంట్ ఉంటే పాలపై నురగ వస్తుంది.
ఇక పాలు చిక్కగా కనిపించేందుకు కొందరు కేటుగాళ్లు పిండి పదార్థాలు, గంజిపొడి వంటివి కలుపుతున్నారు. ఇది తెలుసుకోవడానికి ఒక చెంచాలో పాలను తీసుకోవాలి. అనంతరం అంతే మోతాదులో నీళ్లు మరగబెట్టి చల్లార్చి అందులో 5 చుక్కలు ‘టించర్ అయోడిన్’ కలపాలి. దీనిని పాలలో కలిపితే పాలు నీలి రంగులోకి మారుతాయి. ఇలా మారితే కల్తీ అని అర్థం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..