
ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో క్యాన్సర్ మహమ్మారి ఒకటి. ఒక్కసారి క్యాన్సర్ మహమ్మారి శరీరంలోకి ప్రేవేశిస్తే.. అంత సులభంగా నయం కావడం సాధ్యం కాదు. క్యాన్సర్ చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్న అంశం. ఇక చికిత్స సమయంలో కూడా రోగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
శారీరకంగా, మానసికంగా పూర్తిగా అనార్యోగానికి గురవుతుంటారు. మరీ ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వారిలో జుట్టు రాలే సమస్యను చూసే ఉంటాం. తల వెంట్రుకలు పూర్తిగా రాలిపోతుంటుంది. దీనిని వైద్య పరిభాషలో ‘అలోపేసియా’ అని అంటారు. ఇంతకీ క్యాన్సర్‌కు చికిత్స అందిస్తున్న సమయంలో వెంట్రుకలు ఎందుకు రాలుతాయి.? దీని వెనకాల ఉన్న ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాన్సర్ చికిత్స అందించే విధానంలో ప్రముఖమైంది కీమోథెరపీ లేదా రేడియో థెరపీ. క్యాన్సర్‌కు చికిత్స అందించే సమయంలో జుట్ట రాలడానికి ప్రధాన కారణం ఈ చికిత్స విధానమేనని చెప్పాలి. కీమోథెరపీ సమయంలో ఉపయోగించే మందులు క్యాన్సర్ కణాలతో సహా వేగంగా విభజించే కణాలను లక్ష్యంగా చేసుకుంటాయి. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే కెమోథెరపీ మందులు వేగంగా విభజించే కణాలను లక్ష్యంగా చేసుకుంటాయి. ఇది క్యాన్సర్ కణాలను మాత్రమే కాకుండా, మన శరీరంలోని హెయిర్ ఫోలికల్ సెల్స్ వంటి ఇతర వేగంగా విభజించే కణాలపై ప్రభావం చూపుతుంది. ఈ కణాలు దెబ్బతిన్నప్పుడు, జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.
క్యాన్సర్ యొక్క నిర్దిష్ట ప్రాంతంపై దృష్టి సారించే రేడియోథెరపీ, తల లేదా మెడ చుట్టూ ఉన్న ప్రాంతంలో చికిత్స చేస్తే జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది. అయితే ఇలా జుట్టు రాలడం తాత్కాలికమే అంటున్నారు నిపుణులు. చికిత్స ముగిసిన తర్వాత, హెయిర్ ఫోలికల్స్ మళ్లీ చురుకుగా మారుతుతుంది, తిరిగి జుట్టు పెరుగుతుంది. అయితే తిరిగి జుట్టు రావడానికి సమయం పడుతుంది. చికిత్సి ముగిసిన తర్వాత 3 నుంచి 6 నెలల తర్వాత జుట్టు పెరుగుదల మళ్లీ ప్రారంభమవుతుంది. కానీ జుట్టు పూర్తిగా రావడానికి ఏడాది పడుతుండొచ్చు. క్యాన్సర్ బాధితులు వారి స్కాల్ప్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..