Fact: లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా.? అసలు కారణం ఏంటంటే

సాధారణంగా లిఫ్టుల్లో వెళ్లేటప్పుడు ఏదో తెలియని భయం ఉంటుంది. మనకు తెలియని వ్యక్తులు ఒక చోట చేరడంతో ఆందోళన కలగడం సర్వసాధారణం. అయితే ఆ సమయంలో లిఫ్టులో ఉన్న అద్దం మన దృష్టిని మరలకుండా చేస్తుంది. మన ఏకాగ్రత అంతా అద్దంపై ఉంటుంది. దీంతో ఆందోళన, భయం వంటివి దూరమవుతాయి...

Fact: లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా.? అసలు కారణం ఏంటంటే
Mirror In Lift
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 20, 2024 | 11:11 AM

ప్రస్తుతం లిఫ్ట్‌ల వినియోగం అనివార్యంగా మారింది. ఒకప్పుడు పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్‌లో మాత్రమే లిఫ్ట్స్‌ అందుబాటులో ఉండేవి. అయితే తర్వాత చిన్న చిన్న బిల్డింగ్స్‌లో కూడా లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మనం చూసే చాలా వరకు లిప్టుల్లో అద్దాలు ఉండడం గమనించే ఉంటాం. అయితే లిఫ్టుల్లో అద్దాలను ఎందుకు ఏర్పాటు చేస్తారన్న దానిపై ఆసక్తి ఉండడం సర్వసాధారణం. అసలు లిఫ్టులో అద్దాన్ని ఏర్పాటు చేయడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా లిఫ్టుల్లో వెళ్లేటప్పుడు ఏదో తెలియని భయం ఉంటుంది. మనకు తెలియని వ్యక్తులు ఒక చోట చేరడంతో ఆందోళన కలగడం సర్వసాధారణం. అయితే ఆ సమయంలో లిఫ్టులో ఉన్న అద్దం మన దృష్టిని మరలకుండా చేస్తుంది. మన ఏకాగ్రత అంతా అద్దంపై ఉంటుంది. దీంతో ఆందోళన, భయం వంటివి దూరమవుతాయి. ఇక లిఫ్టులో అద్దం పెట్టడానికి మరో కారణం లిఫ్టు వేగం.

సాధారణంగా లిఫ్ట్‌ వేగంతో వెళ్తుంది. ఈ వేగం కారణంగా చాలా మంది భయడుతుంటారు. అయితే లిఫ్టులో ఉండే అద్దం కారణంగా భయం దూరమవుతుంది. ఇక లిఫ్టులో గాలి తక్కువగా ఉండడం, ఫ్రెష్ ఎయిర్‌ లేకపోవడం కారణంగా క్లాస్ట్రోఫోబియా సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య ఎదురైన సమయంలో మనలో ఆందోళన పెరుగుతుంది, గుండె వేగం పెరుగుతుంది. అరచేతిలో చెమటలు పడుతుంటాయి.  లిఫ్ట్ లో అద్దం ఉండడం, దాని చూడటం వల్ల  ఇలాంటి ఆందోళనలు దూరమవుతాయి. అంతేకాదు అవసరాన్ని మించి ఎవరైనా లిఫ్ట్ ఎక్కినా ఇరుకుగా ఉందనే భావన కలగకుండా చేస్తుంది.

లిఫ్టుల్లో తొలిసారి అద్దాలను మొదటిసారి జపాన్ దేశం ప్రవేశపెట్టింది. లిఫ్టులను ఉపయోగించే వికలాంగుల కోసం అద్దాలను ఏర్పాటు చేశారు. సాధారణంగా వీల్‌ చైర్‌లో కూర్చొని వెనక్కి తల తిప్పడం కష్టంగా ఉంటుంది. దీంతో వీల్ చెయిర్‌ను వెనక్కి తిప్పే సమయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అదే లిఫ్టులో అద్దం ఉంటే వెనకాల నుంచి ఎవరు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. దీంతో వెనక్కి తిరిగి చూడకుండానే చెయిర్ ను తిప్పొచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..