knowledge: రోడ్డుపై కనిపించే ఈ గీతల అర్థం ఏంటో తెలుసా.?

ఈ క్రమంలోనే రోడ్లపై కొన్ని గీతలను గమనించే ఉంటాం. తెలుపుతో పాటు, పసుపు రంగులోనూ ఈ గీతలు ఉంటాయి. ప్రధాన రహదారులన్నింటిపై ఇలాంటి గీతలను అధికారులు ఏర్పాటు చేస్తుంటారు. అయితే చాలా మందికి ఈ గీతల అసలు అర్థం ఏంటో తెలియదు. నిజానికి ఈ గీతలు కూడా ప్రమాదాలను తగ్గించడానికేనని మీకు తెలుసా.? అవును రహదారులపై ఉండే ప్రతీ గీతకు ఒక అర్థం ఉంటుంది. ఇంతకీ రహదారులపై...

knowledge: రోడ్డుపై కనిపించే ఈ గీతల అర్థం ఏంటో తెలుసా.?
Road

Updated on: Dec 16, 2023 | 3:33 PM

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు ఎన్నో రకాల చర్యలు చేపడుతుంటారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్ మొదలు, సైన్‌ బోర్డులను ఏర్పాటు చేస్తుంటారు. లైసెన్స్‌ ఇచ్చే ముందు కూడా ఒక వాహనదారుడికి ట్రాఫిక్‌పై కనీసం పరిజ్ఞానం ఉండేందుకు పరీక్షను సైతం నిర్వహిస్తుంటారు.

ఈ క్రమంలోనే రోడ్లపై కొన్ని గీతలను గమనించే ఉంటాం. తెలుపుతో పాటు, పసుపు రంగులోనూ ఈ గీతలు ఉంటాయి. ప్రధాన రహదారులన్నింటిపై ఇలాంటి గీతలను అధికారులు ఏర్పాటు చేస్తుంటారు. అయితే చాలా మందికి ఈ గీతల అసలు అర్థం ఏంటో తెలియదు. నిజానికి ఈ గీతలు కూడా ప్రమాదాలను తగ్గించడానికేనని మీకు తెలుసా.? అవును రహదారులపై ఉండే ప్రతీ గీతకు ఒక అర్థం ఉంటుంది. ఇంతకీ రహదారులపై ఉండే గీతలకు అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రహదారికి మధ్యలో కనిపించే తెల్లటి రేఖ, రహదారిని రెండు భాగాలు విభజిస్తుంది. అంటే ఒకవైపు వెళ్తున్న వాహనం ఆ గీతను దాటి అవతలి వైపు వెల్లకూడదని అర్థం. మీరు వాహనం నడుపుతున్న దిశలోనే వెళ్లాలని ఈ గీత చెబుతుంది. అవతలి వైపు నుంచి వచ్చే వాహనాలు సైతం ఇదే విధానాన్ని ఫాలో అవుతాయి కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా రోడ్డు మలుపులు ఉన్న చోట ఇలాంటి స్ట్రెయిట్ లైన్స్‌ ఉంటాయి.

* ఇక రోడ్డుకి మధ్యలో గ్యాప్‌లతో కూడిన గీతలు కూడా చేసే ఉంటాం. దీని అర్థం మీరు ప్రయణిస్తున్న దిశను మార్చుకోవచ్చని. అంటే వాహనాలు అవసరాన్ని బట్టి గీత అవతలి వైపు వెళ్లొచ్చని ఈ లైన్‌ సూచిస్తుంది. రోడ్డు ఎలాంటి మలుపులు లేని ప్రదేశాల్లో ఇలాంటి గీతలను గమనించవచ్చు.

* ఇక రహదారిపై పసుపు గీతలు కూడా కనిపిస్తాయి. ఈ గీతకు అర్థం మీరు వాహనాన్ని నడిపించే సమయంలో వేరే వాహనాలను ఓవర్‌ టేక్‌ చేయొచ్చని. అయితే ఈ లైన్‌ దాటి అవతలి వైపునకు వెళ్లకూడదు.

* జీబ్రా క్రాసింగ్ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌తో పాటు మరికొన్ని చోట్ల జీబ్రాక్రాసింగ్‌ కనిపిస్తుంటాయి. బ్లాక్‌, వైట్‌ కలర్స్‌లో ఉండే జీబ్రా క్రాసింగ్స్‌ రోడ్డుపై నడిచే వారు రోడ్డు క్రాస్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..