Do You Know: చెట్లు కూడా మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..!

|

Mar 31, 2023 | 7:09 AM

ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో వింత, వితండపూరిత ఆలోచనలు వస్తాయి. ఖాళీగా ఉన్న సమయంలోనో, మరేదైనా సమయంలోనే వ్యక్తి మెదడులో రకరకాల ఆలోచనలు మెదులుతాయి. మనం ఏదైనా తెలియని విషయం గురించి వింటే వెంటనే ఇంట్లోని పెద్దవాళ్లనో, మన సన్నిహితులనో, స్నేహితులతో అడిగి తెలుసుకుంటాం.

Do You Know: చెట్లు కూడా మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..!
Tree
Follow us on

ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో వింత, వితండపూరిత ఆలోచనలు వస్తాయి. ఖాళీగా ఉన్న సమయంలోనో, మరేదైనా సమయంలోనే వ్యక్తి మెదడులో రకరకాల ఆలోచనలు మెదులుతాయి. మనం ఏదైనా తెలియని విషయం గురించి వింటే వెంటనే ఇంట్లోని పెద్దవాళ్లనో, మన సన్నిహితులనో, స్నేహితులతో అడిగి తెలుసుకుంటాం. వారెవరికీ తెలియకపోతే.. గూగుల్‌ తల్లిని ఆశ్రయిస్తాం. అక్కడ చూసి తెలుసుకుంటాం. సాధారణంగానే మనిషికి వింత వింత ఆలోచనలు, ప్రశ్నలు వస్తుంటాయి. మరి చెట్లు కూడా తమలో తాము మాట్లాడుకుంటాయని, ఒకదానికొకటి సాయం చేసుకుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? లేకపోతే చెట్ల గురించిన ప్రత్యేక వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.

సైంటిస్టులు జరిపిన పరిశోధనల ప్రకారం.. చెట్లు ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. చెట్లు మాట్లాడుతాయి. వాటి వేర్లు ‘వుడ్ వైడ్ వెబ్’ అని పిలువబడే శిలీంద్రాల భూగర్భ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. వీటి సాయంతో ఒకదానితో ఒకటి వనరులను పంచుకోవడానికి సహకరించుకుంటాయి. ఈ శిలీంద్రాల ద్వారా ఒకదానికొకటి పోషకాలను పంచుకోవడం ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఉదాహరణకు ఒక తల్లి చెట్టు, లేదా అడవిలో భారీ, పురాతన, బలమైన చెట్టు దానిలోని పోషకాలను పక్కనే ఉన్న చిన్న, సమీపంలోని చెట్లతో పంచుకుంటుంది. ఇలా ఒక చెట్టుతో మరో చెట్టు కమ్యూనికేట్ చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..