AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమాజంలో విలువ పెరగాలంటే తప్పనిసరిగా ఇవి పాటించండి..! మిస్సవ్వకండి వెంటనే తెలుసుకోండి..!

సమాజంలో మన విలువ పెరగాలంటే కొన్ని ముఖ్యమైన ప్రవర్తనా అలవాట్లను అభ్యసించాలి. సాధారణంగా కనిపించే ఈ చిన్న మార్గాలు మన వ్యక్తిత్వానికి పెద్ద మార్పు తీసుకురాగలవు. మర్యాద, వినయంతో కూడిన ప్రవర్తన మనపై మంచి ముద్ర వేసి ఇతరుల గౌరవాన్ని పొందేలా చేస్తుంది.

సమాజంలో విలువ పెరగాలంటే తప్పనిసరిగా ఇవి పాటించండి..! మిస్సవ్వకండి వెంటనే తెలుసుకోండి..!
Respectful Habits
Prashanthi V
|

Updated on: Apr 05, 2025 | 4:44 PM

Share

ఇప్పటి సమాజంలో మన విలువ పెరగాలంటే కొన్ని సూత్రాలను జీవితంలో పాటించటం చాలా అవసరం. ఇవి చిన్న విషయాల్లా అనిపించినా మన వ్యక్తిత్వాన్ని ప్రభావవంతంగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇతరుల మధ్య గౌరవం పొందాలంటే ఈ అంశాలను త‌ప్ప‌క పాటించండి.

ఏమైనా ఫంక్షన్, వేడుక, సమావేశం అని ప్రత్యేకంగా పిలవకపోతే అక్కడికి వెళ్లడం మంచి అభిప్రాయం రాకుండా చేస్తుంది. ఇది మనపై ఇతరులు అతను పిలువకుండా వచ్చేశాడు అనే అభిప్రాయంతో చూస్తారు. అందుకే మన విలువను కాపాడుకోవాలంటే ఆహ్వానం వచ్చినప్పుడు మాత్రమే హాజరయ్యే అలవాటు ఉండాలి.

ఎవరినైనా కలిసినపుడు కూర్చునే స్థితిలో ఉండి షేక్‌హ్యాండ్ ఇవ్వడం అసహ్యంగా కనిపించవచ్చు. ఇది అహంకారంగా భావించబడుతుంది. ఎవరైనా ఎదురుగా వచ్చినప్పుడు లేచి మర్యాదగా పలకరించడం మంచి సంస్కారాన్ని చూపిస్తుంది. ఇది మన వ్యక్తిత్వానికి విలువను జోడిస్తుంది.

ఎవరైనా ఇంటికి వెళ్లినప్పుడు వారు అందించిన ఆహారంపై అభినందనల మాటలు చెప్పడం మంచిదే. మీ వంట బాగా ఉంది, చాలా రుచిగా ఉంది అనే పదాలు మనం అహంకారంతో లేని వ్యక్తిగా కనిపించేలా చేస్తాయి. ఇలా చెప్పడం వల్ల వారు మన పట్ల గౌరవం కలిగి ఉంటారు.

ఆర్థికంగా ఎదగాలంటే ఖర్చుపై నియంత్రణ ఉండాలి. అవసరం కోసం మాత్రమే ఖర్చు చేయడం మిగిలిన దానిని పొదుపుగా ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది మన స్వాతంత్ర్యాన్ని, విలువను సమాజంలో పెంచుతుంది.

ఎవరైనా మాట్లాడుతుంటే వారిని పూర్తిగా వినడం ద్వారా వారిపై మన ఆసక్తిని చూపినట్లవుతుంది. మధ్యలో మొబైల్ చూస్తూ ఉండటం కన్నెత్తి చూడకపోవడం వంటివి నిర్లక్ష్యంగా భావించబడతాయి. ఐ కాంటాక్ట్ చేయడం, హుందాగా స్పందించడం వల్ల మనపై నమ్మకం పెరుగుతుంది.

పనిలో ఓడిపోయినప్పుడు నెగెటివ్‌గా స్పందించడం ఇతరులపై దోషం వేయడం మంచిది కాదు. దాని బదులు నేనే తప్పు చేసాను అని అంగీకరించడం ద్వారా మనలో నిజాయితీ ఉన్న వ్యక్తిగా ఎదుగుతాం. ఇది మన విలువను మరింత పెంచుతుంది.

చిన్న చిన్న సమస్యలతో చిరాకు పడకుండా నవ్వుతూ స్పందించడం వల్ల మన చుట్టూ ఉన్నవారికి సానుకూలత ఏర్పడుతుంది. శాంతంగా ఉండే వ్యక్తులను సమాజం ఎక్కువగా ఆదరిస్తుంది. నవ్వు మనం ఇతరులపై పెట్టే మంచి ముద్రగా మారుతుంది.

మీ ఆర్థిక విషయాలు, ఆరోగ్య సమస్యలు వంటి విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. ఇవి వ్యక్తిగతమైనవి కాబట్టి అవి బయటికి వెళితే మీ విశ్వసనీయత దెబ్బతినే అవకాశం ఉంది. ప్రతి విషయం శేర్ చేయడం మంచిదని కాదు.

బయటకు వెళ్లేటప్పుడు సింపుల్ గా సందర్భానికి తగినట్టు దుస్తులు ధరించాలి. మన దుస్తులు చూసే వారు మన గురించి తొలి అభిప్రాయాన్ని ఏర్పరుస్తారు. శుభ్రంగా, సరిగ్గా ఉన్న దుస్తులు మనపై మంచి ముద్రను కలిగిస్తాయి.

ఈ అలవాట్లను క్రమంగా జీవన విధానంలోకి తీసుకొచ్చినప్పుడు మన వ్యక్తిత్వానికి విలువ పెరుగుతుంది. ఇతరుల గౌరవాన్ని సంపాదించడమంటే మన ప్రవర్తన ద్వారా నమ్మకాన్ని పెంపొందించుకోవడమే. ఇవి పాటించడం వల్ల మీ స్థానం సమాజంలో మరింత మెరుగవుతుంది.