What is ECMO: ఎక్మో అంటే ఏంటి.. ఏ పరిస్థితుల్లో ఈ వైద్యం అందిస్తారు.. ఎలా ట్రీట్మెంట్ చేస్తారు..?

|

Jan 29, 2023 | 12:25 PM

ఎక్మో అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. ఒక జత కృత్రిమ గుండె, ఊపిరితిత్తులు శరీరం వెలుపల నుంచి పని చేస్తాయి. ECMO టెక్నాలజీ అంటే ఏంటి..?ఇది ఎలా పని చేస్తుంది. ఈ చికిత్సకు ఖర్చు ఎంత ఉంటుంది..? మనం ఇక్కడ తెలుసుకుందాం..

What is ECMO: ఎక్మో అంటే ఏంటి.. ఏ పరిస్థితుల్లో ఈ వైద్యం అందిస్తారు.. ఎలా ట్రీట్మెంట్ చేస్తారు..?
Ecmo
Follow us on

ఎక్మో.. ఇదే ఇప్పుడు బాలుకీ లైఫ్ సరోప్ట్‌. చాలా రోజులుగా అస్వస్థత నుంచి కోలుకుంటున్న వ్యక్తికి షడన్‌గా గుండె, ఊపిరి తిత్తుల పని చేయని పక్షంలో అత్యవసరంగా ‘ఎక్మో’ యంత్రం మీద ఉంచి కొన్ని గంటల పాటు చికిత్స అందిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని ఆపదలో ఉన్న బాధితుడికి ప్రాణరక్షణ లాంటిది. ఈ వైద్యాన్ని 2016లో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు అందించారు. ఆ తర్వాత ప్రముఖుల్లో గాన గాంధర్వుడు ఎస్పీ బాలుకి కూడా అందించారు.  అయితే, ఇతర పద్ధతుల్లో హార్ట్, లంగ్ సపోర్ట్ ఫెయిల్ అయిన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ టెక్నాలజీతో లైఫ్ సపోర్ట్ అందిస్తారు. ఈ పద్ధతిలో శరీరం నుంచి రక్తం తీసుకుని ఒక మెషీన్ సహాయంతో రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్‌ని తొలిగించి ఆర్టిఫిషియల్ ఆక్సిజనేషన్‌ను అందులో మిక్స్ చేస్తారు. కోవిడ్ మహమ్మారి బాధితులకు చాలామందికి ఈ విధమైన చికిత్సను అందించారు. కొవిడ్ 19 న్యుమోనియాతో బాధ పడుతూ బ్లడ్ ఆక్సిజెన్ లెవెల్స్ ని సస్టెయిన్ చేయడానికి వెంటిలేషన్  సహాయంతో పేషెంట్స్‌కి ఈ ఎక్మోను ఉపయోగిస్తారు.

ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ (ఇఎల్ఎస్ఒ) అనేది ఒక ఇంటర్నేషనల్ కన్సార్టియం. ఇందులో పని చేయని అవయవాలకి సపోర్ట్ ఇచ్చే ఎక్మో లాంటి థెరపీల డెవలప్మెంట్, టెస్టింగ్ కి అంకితం కాబడిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, సైంటిస్ట్స్ ఉంటారు. తన పనిలో భాగం గా ఎల్సో ప్రపంచవ్యాప్తంగా ఎక్మో మీద ఉంచబడ్డ వారి వివరాలని తెలుసుకుంటుంది. ఇంకే ఇతర పద్ధతీ పని చేయని కొవిడ్ 19 పేషెంట్స్ విషయంలో కూడా ఎక్మో వాడకం ద్వారా సుమారు 55% కోలుకున్నారు. చూడగానే ఇది పెద్ద సంఖ్యలా కనిపించకపోవచ్చు కానీ, ఈ థెరపీ యూజ్ చేసి ఉండకపోతే వీరు బ్రతికి ఉండేవారు కాదు.

ECMO టెక్నాలజీ అంటే ఏంటి..?

ఎక్స్‌ట్రా-కార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్ అంటే ECMO పరికరాన్ని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. దీనిలో ఒక జత కృత్రిమ గుండె, ఊపిరితిత్తులు శరీరం వెలుపల నుంచి పని చేస్తాయి. బాధితుడి ఊపిరితిత్తులు లేదా గుండె పనిచేయలేనప్పుడు ఇది శరీరానికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. బాధితుడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు. ECMO పరికరం ఉపయోగించబడుతుంది.

ఇది 1960లో కనుగొనబడింది..

ECMO యంత్రం నేటి ఆవిష్కరణ కాదు. ఇది 1960 ల నుంచి ఉపయోగించబడుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న నవజాత శిశువులకు ఇది ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. సుమారు ఐదు సంవత్సరాల క్రితం యువకులు,  వృద్ధ రోగులకు కూడా చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు.

ECMO యంత్రం ఎలా పనిచేస్తుంది..

ఈ ట్యూబ్ రోగి రక్తాన్ని కృత్రిమ ఆక్సిజనేటర్ (లేదా కృత్రిమ ఊపిరితిత్తుల)కి తీసుకువెళ్లడానికి సహాయపడుతుంది. ఈ యంత్రం ద్వారా రక్తం నుంచి కార్బన్ డయాక్సైడ్ తొలగించబడుతుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ రక్తంలో చేర్చబడుతుంది. అది తిరిగి బాధితుడి శరీరంలోకి పంపబడుతుంది.

ECMO ఎప్పుడు ఉపయోగించబడుతుంది?

ECMO సాంకేతికత వైద్యుల ముందు ఉన్న చివరి ఎంపికలలో ఒకటి అని చెప్పవచ్చు. వెంటిలేటర్ లేదా ఇతర మార్గాల వంటి ఇతర సాధ్యమైన ఎంపికల ద్వారా రోగి పరిస్థితి నయం కానప్పుడు ఇది ఉపయోగించబడుతుంది.

ఎక్మో ఎలా వాడతారు..

ఎక్మో లో రెండు రకాలున్నాయి. వీనో వీనస్ అంటే లంగ్స్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వీనో ఆర్టీరియల్ అంటే లంగ్స్, హార్ట్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఎక్మో సర్క్యూట్ ని పేషెంట్‌కి కనెక్ట్ చేయడానికి ఒకటి నుంచి మూడు కాన్యులాల వరకూ యూజ్ చేస్తారు. సాధారణంగా పేషెంట్ యొక్క కుడి మెడ మీద సర్జన్ చిన్న కోత పెడతారు. అందులో నుంచి ఒక ట్యూబ్ ని జగులర్ వెయిన్ లోకి పంపిస్తారు. ఒక్కోసారి అదే కోత ద్వారా రెండవ ట్యూబ్ కూడా పంపిస్తారు. ఇది కరోటిడ్ ఆర్టరీలోకి వెళ్తుంది. ఈ ట్యూబ్స్ ని ఒక మెషీన్ కి కనెక్ట్ చేస్తారు. ఆ మెషీన్ బ్లడ్ ని ఆక్సిజనేట్ చేస్తుంది. ఒక్కోసారి, ఈ ట్యూబ్స్ ని డైరెక్ట్ గా ఏట్రియంలోకి కానీ అయోర్టా లోకి కానీ పంపిస్తారు.

ఎక్మోని మొదటిసారి ఇచ్చినప్పుడు..

ఎక్మోని మొట్టమొదటి సారి ఎడ్మినిస్టర్ చేసినప్పుడు పేషెంట్ కి మత్తు ఇచ్చి, ప్యారలైజ్ చేస్తారు. కానీ, ఎక్మో యొక్క లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే పేషెంట్స్ స్టెబిలైజ్ అయిన తరువాత వారిని మత్తులో నుంచి లేపి వారిని వారి కేర్ లో భాగస్వాములని చేయడం.

ECMO టెక్నాలజీకి ఎంత ఖర్చవుతుంది..

ECMO అనేది చాలా ఖరీదైన సాంకేతికత.. ఇది ప్రస్తుతం ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రులలో మాత్రమే ఉపయోగించబడుతుంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం, ECMO విధానం ప్రారంభ 2 రోజుల్లో రోజుకు రూ. 1.75 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత రోజుకు 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.

దీనికి ఎన్నో రిసోర్సులు కావాలి. అందుకే, అన్ని చోట్లా ఇది వాడడం కుదరకపోవచ్చు. మామూలు పరిస్థితుల్లో ఎక్మో వాడిన తరువాత పేషెంట్స్ లేచి ఈ ఆర్టిఫిషియల్ లంగ్ సహాయంతో నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్మో వాడకం లో ఒక గోల్ ఏమిటంటే పేషెంట్ తన కేర్ లో తను పాలు పంచుకోవడం, అంటే పేషెంట్ యాక్టివ్ గా ఉండడం, తన మెడికేషన్ గురించి తను తెలుసుకునే పరిస్థితి ఉండడం.

ECMO టెక్నిక్ ప్రమాదకరమా?

ECMO టెక్నిక్‌తో రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ECMO మెషీన్‌లో పెట్టే ముందు రోగులకు బ్లడ్ థిన్నర్‌లు ఇవ్వడం వల్ల, వారికి శరీరంలోని అనేక భాగాల నుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఇది కాకుండా, ECMO సాంకేతికత చాలా మంది రోగులలో మూత్రపిండాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది. దీనితో పాటు, శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం