Job Offer: రూ. 2 కోట్ల జీతం, భోజనం, వసతి అన్నీ ఫ్రీ.. అయినా ఉద్యోగి దొరకడం లేదు.. కారణం తెలిస్తే గుడ్లు తేలేస్తారు..!

|

May 21, 2023 | 8:58 PM

ఒక వృద్ధ మహిళ తన సంరక్షణ కోసం ఒక పని మనిషిని వెతుకుతోంది. వంట, ఇంటి పని సహా, తనకు సహాయకులుగా ఉండాలి. ఇందుకో కోసం.. ఊహించని స్థాయిలో జీతం, ఇతర సౌకర్యాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయినప్పటికీ.. ఆమెకు పని మనిషి దొరకడం లేదు. మరి అందుకు కారణం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు. ఇంతకీ ఏ పని మనిషి కూడా ముందుకు

Job Offer: రూ. 2 కోట్ల జీతం, భోజనం, వసతి అన్నీ ఫ్రీ.. అయినా ఉద్యోగి దొరకడం లేదు.. కారణం తెలిస్తే గుడ్లు తేలేస్తారు..!
Job Offer
Follow us on

ఒక వృద్ధ మహిళ తన సంరక్షణ కోసం ఒక పని మనిషిని వెతుకుతోంది. వంట, ఇంటి పని సహా, తనకు సహాయకులుగా ఉండాలి. ఇందుకో కోసం.. ఊహించని స్థాయిలో జీతం, ఇతర సౌకర్యాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయినప్పటికీ.. ఆమెకు పని మనిషి దొరకడం లేదు. మరి అందుకు కారణం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు. ఇంతకీ ఏ పని మనిషి కూడా ముందుకు రాకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మంచి జీతంతో కూడిన మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటారు. తమ అంచనాలకు మించి జీతం, భోజనం, వసతి ఉచితంగా లభిస్తే.. ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్లి పని చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే చైనాలోని షాంఘైకి చెందిన ఓ మహిళ తన ఇంటి పనులు, క్యాటరింగ్ చూసుకోవడానికి హౌస్ కీపర్ కోసం వెతుకుతోంది. హౌస్ కీపర్‌కి రూ. 2 కోట్ల జీతం ప్యాకేజీ కూడా ఆఫర్ చేసింది. భోజనం, వసతి సౌకర్యాలన్నీ ఇస్తానంటోంది. అయినప్పటికీ ఏ ఒక్కరు పని చేసేందుకు ముందుకు రావడం లేదు. కారణం.. ఆమె తన ప్రకటనలో పేర్కొన్న కండీషన్స్. అవును, అవే ఆమెకు ఒక్క పని వారిని దొరక్కుండా చేస్తున్నాయి. మరి ఆమె విడుదల చేసిన ప్రకటనలో ఏముంది? ఆ కండీషన్స్ ఏంటి?

చేయవలసిన పనులు..

తాను చెప్పినట్లుగా ఆహారాన్ని తయారు చేయాలి. సమయానికి అందించాలి. ఇంటిని శుభ్రపరచడంతో పాటు.. ఆమె చెప్పిన ప్రతి పని చేయాలి. ఈ పని చేసినందుకు గాను ఏడాదికి రూ. 1.97 కోట్లు జీతం ఇస్తుంది. అంటే నెలకు రూ. 16 లక్షలు.

ఇవి కూడా చదవండి

షరతులు..

1. దరఖాస్తుదారులు కనీసం 165 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.

2. బరువు 55 కంటే తక్కువ ఉండాలి.

3. ఇంటర్మీడియట్, ఆ పై చదువులు చదివిన వారై ఉండాలి.

4. అందంగా, శుభ్రంగా ఉండాలి.

5. మంచి డ్యాన్స్‌, సింగింగ్‌లో నైపుణ్యం ఉండాలి.

ఈ షరతులతో కూడిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే, ఈ కండీషన్స్ చూసి ఏ పని వారు కూడా ముందుకు రావడం లేదు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..