Chanakya Niti: భార్య ఎప్పుడూ హ్యాపీగా ఉండాలంటే.. భర్త ఈ పనులు చేస్తే చాలట
కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు తొలినాళ్లలో హ్యాపీగా ఉంటారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరికీ వైవాహిక జీవితం బోర్ కొట్టడం మొదలవుతుంది. అలాంటప్పుడు భార్యను ఎలప్పుడూ హ్యాపీగా ఉంచేందుకు..
కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు తొలినాళ్లలో హ్యాపీగా ఉంటారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరికీ వైవాహిక జీవితం బోర్ కొట్టడం మొదలవుతుంది. అలాంటప్పుడు భార్యను ఎలప్పుడూ హ్యాపీగా ఉంచేందుకు, భర్త ఈ పనులు చేస్తే చాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. మరి వైవాహిక జీవితం బలోపేతం చేసేందుకు చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఏంటో తెలుసుకుందామా..
ఎల్లప్పుడూ గౌరవంగా వ్యవహరిచాలి:
తన భార్యను గౌరవంగా చూసే వ్యక్తి, తమ వైవాహిక బంధాన్ని బలోపేతం చేసుకోగలడని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. అలాంటి వ్యక్తి తన భార్య నుండి గౌరవాన్ని తిరిగి పొందుతాడు. తన భర్త తనకు తగినంత గౌరవాన్ని ఇస్తున్నాడని ఆమె కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది.
స్నేహితుడిలా వ్యవహరించడం:
భార్యాభర్తలు స్నేహితుల్లా జీవించడం వల్ల దాంపత్యం ఆనందంగా సాగుతుంది. చాణక్యుడు ప్రకారం భార్యాభర్తలిద్దరూ స్నేహితులుగా జీవించాలి. మంచి సమయాల్లో, చెడు సమయాల్లో ఒకరికొకరు అండగా ఉండాలి. ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. ఈ రకమైన భర్తతో, భార్య వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.
ఇద్దరూ సమానమే:
కుటుంబంలో ఇద్దరు సమానంగా ఉండాలి. భార్యను సమానంగా చూసే భర్త ఆమెను సంతోషంగా ఉంచగలడు. భర్త తన భార్యపై ఆధిపత్యం చెలాయించకూడదు. నేను ఎక్కువ, నువ్వు తక్కువ అనే మాటలు భార్యాభర్తల మధ్య ఉండకూడదు. ఇద్దరూ ప్రతీ విషయాన్ని చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవాలి.
సురక్షిత భావాన్ని అందించడం:
తన భాగస్వామి దగ్గర ఆమె సురక్షితంగా ఉన్నానని భావిన్చినప్పుడే.. ఆ బంధం బాగుంటుందని చాణక్య తత్వం పేర్కొంది. భార్య ఎప్పుడూ తన భర్తలో తండ్రిని చూస్తుంది. తన భర్తను అన్ని వేళలా తనతో పాటుగా ఉంటూ తనను కాపాడుతాడని నమ్ముతుంది. ఈ విధంగా, మీరు మీ భార్యకు ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా సురక్షితంగా ఉంచినట్లయితే, ఆమె మీతో సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.
భార్యతో నిజాయితీ:
చాణక్య నీతి ప్రకారం, బంధంలో నిజాయితీ చాలా ముఖ్యం. నిజాయితీ ఉంటే బంధం తెగదు. మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపాలనుకుంటే మీ భార్యతో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి.
శారీరక ఆనందాన్ని ఇవ్వడం:
చాణక్యుడు ప్రకారం, సంతోషకరమైన వైవాహిక జీవితానికి శారీరక సంతృప్తి కూడా ముఖ్యం. అందువల్ల భర్త తన భాగస్వామి మానసిక, శారీరక ఆనందంపై దృష్టి పెట్టాలి. శారీరక సంబంధానికి ముందు భర్త తన భార్య సమ్మతిని పొందాలి. భర్త శారీరక సంబంధానికి దూరంగా ఉంటే, భార్య మానసిక కుంగుబాటుకు గురవుతుంది. కాబట్టి శారీరక ఆనందాన్ని ఇవ్వడం భర్త విధి.