Bumble Dating App: మహిళలే తొలి ప్రాధ్యాన్యతం.. విమెన్ సేఫ్టీ కోసం డేటింగ్ యాప్ బంబుల్..

|

Feb 12, 2021 | 9:05 PM

అగ్రరాజ్యం అమెరికాలో మహిళలకే ప్రాధాన్యం అంటూ బంబుల్ డేటింగ్ యాప్ వంటి డిఫరెంట్ ఆలోచనతో ముందుకొచ్చి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా బిలియనీర్‌గా బంబుల్ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు విట్నీ వోల్ఫ్ హెర్డ్ ఎదిగారు. ఆమె జీవితం స్ఫూర్తిదాయకం అంటూ..

Bumble Dating App: మహిళలే తొలి ప్రాధ్యాన్యతం.. విమెన్ సేఫ్టీ కోసం డేటింగ్ యాప్ బంబుల్..
Follow us on

Bumble Dating App: అగ్రరాజ్యం అమెరికాలో మహిళలకే ప్రాధాన్యం అంటూ బంబుల్ డేటింగ్ యాప్ వంటి డిఫరెంట్ ఆలోచనతో ముందుకొచ్చి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా బిలియనీర్‌గా బంబుల్ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు విట్నీ వోల్ఫ్ హెర్డ్ ఎదిగారు. ఆమె జీవితం స్ఫూర్తిదాయకం అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి బంబుల్ ఒక పబ్లిక్ కంపెనీ అయ్యిందని వోల్ఫ్ హెర్డ్ గురువారం ట్వీట్టర్ వేదికగా ప్రకటించింది. అంతేకాదు ఈ ముందడుగు వెనుక 1.7 బిలియన్ల కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారని.. ఈరోజు తనకంటూ వ్యాపార ప్రపంచంలో గుర్తింపు .. రావడానికి సుగమం చేసిన మార్గదర్శక మహిళలకు కృతజ్ఞతలను తెలిపింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ సీఈవో థాంక్స్ చెప్పింది.

బంబుల్ డేటింగ్ యాప్ పబ్లిక్ యాప్ గా అడుగు పెట్టిన వెంటనే న్యూ యార్క్ ట్రేడింగ్ లో ట్రెండింగ్ సృష్టిస్తోంది. బంబుల్ ఇంక్ షేర్లు విలువ న్యూయార్క్‌లో మధ్యాహ్నం 1:03 గంటలకు 72 డాలర్లకు చేరుకుంది. దీంతో బంబుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విట్నీ వోల్ఫ్ హెర్డ్ వాటాను 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ ఏజెన్సీ అంచనా వేసింది. ఇప్పటికే ఆన్ లైన్ లో అనేక డేటింగ్ యాప్స్ ఉన్న నేపథ్యంలో బంబుల్ యాప్ నిలుస్తుందా అన్న అనుమానాలకు చెక్ పెడుతూ ఓ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ యాప్ వినియోగదారులకు సరికొత్త సేవలను అందిస్తోంది. ఈ యాప్ లో రిజిస్టర్ అయిన మహిళలకు తమకు సూటబుల్ వ్యక్తులనే పరిచయం చేస్తుంది. అయితే స్వలింగ సంపర్కులైతే ఎవరైనా ముందుగా సందేశాన్ని పంపవచ్చు.

ఈ యాప్ ద్వారా తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ మహిళలకే ఉంది. పాట్నర్ కదలికపై పూర్తి నియంత్రణ కూడా మహిళలకే ఉంది. అయితే తమ భాగస్వామిగా సరిపోయే వ్యక్తులకు సందేశం పంపించడానికి కేవలం అవతలివారు 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఫర్ఫెక్ట్ మ్యాచ్ కానట్లయితే.. అవతలివారు అదృశ్యమవుతారు

యాప్ ల ద్వారా మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, అనుచిత వ్యాఖ్యలు వంటి పలు సమస్యలనుంచి ఈ బంబుల్ యాప్ రక్షణ ఇస్తుంది. అటువంటి వారిని ఈ యాప్ ఉపయోగించే మహిళలు బాంబు దాడి చేస్తూ కంట్రోల్ లో పెడతారు. ఈ బంబుల్ యాప్ నూతన ఒరవడి కావాలని అనుకునే నేటి మహిళ కోసం సృష్టించబడిందని.. తమ సోషల్ మీడియా బృందం ఆన్ లైన్ లో మహిళలు ఎలా ఉండాలనుకుంటున్నారో తెలుసుకుంది.. మహిళలు యాప్ ఉపయోగించే సమయంలో మరింత శక్తివంతులుగా మార్చే విషయంపై అనేక పరిశోధనలు చేశారమని బంబుల్ గ్లోబల్ స్ట్రాటజీ డైరెక్టర్ ప్రితి జోషి 2019 లో చెప్పారు.

ఈ యాప్ ను ఆపిల్ యాప్ స్టోర్‌ తో పాటు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంతేకాదు బంబుల్.కామ్‌లో బ్రౌజర్ ద్వారా బంబుల్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ వినియోగదారుడు డేటింగ్ యాప్ గడువు ముగిసినా కొనసాగించాలంటే.. రూ. నెలకు రూ. 450 లను చెల్లించాల్సి ఉంది.

ఈ యాప్ సృష్టి వెనుక ఓ రీజన్ కూడా ఉందని తెలుస్తోంది. వోల్ఫ్ హెర్డ్ బంబుల్ యాప్‌ను సృష్టించక ముందు టిండెర్‌లో సహ వ్యవస్థాపకుడిగా పనిచేశారు. అయితే 2012 లో టిండెర్ నుంచి బయటకు వచ్చి ఆ కంపీనీ పై
లైంగిక వేధింపుల దావా వేసి ఓడిపోయారు. దీంతో 2006 రష్యన్ బిలియనీర్ ఆండ్రీ ఆండ్రీవ్ ప్రారంభించిన బాడూను ఇన్స్పైర్ గా తీసుకుని తానే స్వయంగా డేటింగ్ ను మహిళలే నియంత్రించే విధంగా సరికొత్త అల్రోచనతో 2014 లో బంబుల్‌ ను స్థాపించారు.

2018 లో ఈ యాప్ ను గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రమోట్ చేసింది. అంతేకాదు ఈ డేటింగ్ యాప్ కు భాగస్వామి, సలహాదారు పెట్టుబడిదారుగా ఉంటానని ప్రియాంక చోప్రా బంబుల్ తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గత ఏడాది బంబుల్ వ్యవస్థాపకురాలు విట్నీ బృందంతో కలిసి పనిచేస్తున్న సమయంలో తాను నిజమైన సామజిక ప్రేరణ పొందానని తెలిపింది ప్రియాంక. ఈ యాప్ లో భాగస్వామిగా మారినందుకు గర్వపడుతున్నానని చెప్పింది.
మహిళలకు ప్రేమ , స్నేహం కావాలి .. అంతేకాదు వారి వృత్తిని గౌరవించే భాగస్వామిని కోరుకుంటారు.. అవన్నీ అందించడమే మా బంబుల్ ప్రత్యేక అని చెప్పింది. ఈ యాప్ మహిళలను సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉపయోగించవచ్చని ధీమా వ్యక్తం చేసింది ప్రియాంక చోప్రా . ఈ యాప్ లో ప్రముఖ టెన్నిన్స్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కూడా పెట్టుబడులు పెట్టడం విశేషం.

Also Read:

నాన్ వెజ్ ప్రియుల కోసం … రుచికరమైన నిల్వ చేసుకునే చికెన్ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!

రిక్షావాలా కూతురు మిస్ ఇండియా రన్నరప్.. ఈ స్టేజ్ కు చేరుకోవడానికి మాన్యాసింగ్ పడిన కష్టం.. కృషి తెలుసుకోవాల్సిందే..!