దుంపకూరల్లో ఒకటి ముల్లంగి. దీనిని తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు. ముల్లంగిని అందరూ తింటారు. దీనిని ఊరగాయ, చట్నీ, సలాడ్, పరాటా, కూరల రూపంలో తీసుకుంటారు. సర్వసాధారణంగా అందరూ ఉపయోగించేది తెల్ల రంగులో ఉండే ముల్లంగినే.. అయితే తెల్ల ముల్లంగి మాత్రమే కాదు నల్ల ముల్లంగి కూడా ఉందని తెలుసా.. దీని పేరు విని షాక్ అవుతున్నారా..! ముల్లంగి తెల్లగా మాత్రమే ఉంటుంది, నలుపు ఎక్కడ నుండి వచ్చింది అని ఆలోచిస్తున్నారా.. అయితే నల్ల ముల్లంగి కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంది. అంతేకాదు తెల్ల ముల్లంగిలో కంటే నల్ల ముల్లంగిలో ఎక్కువ విటమిన్లు, పోషకాలు లభిస్తాయి. ఈ నల్ల ముల్లంగి సాగు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అదే సమయంలో, మార్కెట్‌లో నల్ల ముల్లంగికి క్రమంగా డిమాండ్ కూడా పెరుగుతోంది.
నల్ల ముల్లంగి చూడడానికి బయట నుండి మాత్రమే నల్లగా ఉంటుంది. కట్ చేస్తే లోపల అది తెల్ల ముల్లంగిలా ఉంటుంది. కానీ తెల్ల ముల్లంగి కంటే నల్ల ముల్లంగిలో ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు మెండు. నల్ల ముల్లంగి తినడం వల్ల శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది. దీనిని ఆయుర్వేద ఔషధంలో ఉపయోగిస్తారు. విటమిన్-బి6, థయామిన్, ప్రొటీన్, విటమిన్-ఇ, ఫైబర్‌తో సహా అనేక రకాల పోషకాలున్నాయి. అంతేకాదు నల్ల ముల్లంగి తినడం వలన శరీరాన్ని ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
నల్ల ముల్లంగిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.
నిజానికి నల్ల ముల్లంగి ఒక రకమైన కూరగాయ. దీనిని స్పానిష్ ముల్లంగి అని కూడా అంటారు. దీనిని సలాడ్‌లో మాత్రమే కాదు.. కూరలని కూడా తయారు చేస్తారు. మార్కెట్‌లో తెల్ల ముల్లంగి కంటే నల్ల ముల్లంగి ధర ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. నల్ల ముల్లంగిని తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది.
నల్ల ముల్లంగిని ఎలా పండించాలంటే..
విశేషమేమిటంటే నల్ల ముల్లంగిని కూడా తెల్ల ముల్లంగిలానే సాగు చేస్తారు. ముందుగా ఆవు పేడను ఎరువుగా పొలంలో వేస్తారు. దీని తరువాత భూమిని చాలాసార్లు దున్నుతారు. తర్వాత పొలాన్ని చదును చేస్తారు. దీని తరువాత విత్తనాలు నాటతారు. అనంతరం పొలంలో నీటి పారుదల కోసం ఏర్పాటు చేసుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉంటే పంట పాడైపోతుంది.. కనుక పొలంలో నీరుపారుదల కోసం ఏర్పాటు చేసుకోవాలి.
ఒక ఎకరంలో నల్లముల్లంగి సాగు చేస్తే రూ.30 నుంచి 35 వేల వరకు ఖర్చవుతుంది. అయితే నల్ల ముల్లంగి దిగుబడి రెండు నెలలకే వస్తుంది. రెండు నెలల తర్వాత మీరు నల్ల ముల్లంగిని అమ్మడం ద్వారా బాగా సంపాదించవచ్చు. ఎకరంలో 70 నుంచి 80 క్వింటాళ్ల ముల్లంగి దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో నల్ల ముల్లంగి క్వింటాల్‌కు రూ.1000 పలుకుతోంది. కనుక 80 క్వింటాళ్ల ముల్లంగి అమ్మడం ద్వారా రూ.80వేలు సంపాదించవచ్చు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..