Worst Polluted City: బెంగళూరుకు సరికొత్త చెత్త రికార్డు.. దేశంలోనే అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడో స్థానం..

బెంగళూరు భారత దేశంలో అత్యధిక ట్రాఫిక్ గల నగరమని అందరికీ తెలుసు. గార్డెన్ సిటీగా పిలువబడే ఈ నగరం యొక్క అసలైన అందాలు ఇక్కడి ప్రకృతి.  ఇలాంటి దృశ్యాలు..

Worst Polluted City: బెంగళూరుకు సరికొత్త చెత్త రికార్డు.. దేశంలోనే అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడో స్థానం..
Bengaluru
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 20, 2021 | 11:23 PM

Worst Polluted City: బెంగళూరు భారత దేశంలో అత్యధిక ట్రాఫిక్ గల నగరమని అందరికీ తెలుసు. గార్డెన్ సిటీగా పిలువబడే ఈ నగరం యొక్క అసలైన అందాలు ఇక్కడి ప్రకృతి.  ఇలాంటి దృశ్యాలు మళ్లీ మళ్లీ చూడలేమేమో అని మీకు అనిపిస్తుంది. అయితే ఇలాంటి పచ్చని నగరంపై ఇప్పుడు కాలుష్య కారక నగర జాబితాలో చేరిపోయింది.

బెంగళూరు ప్రశాంతమైన వాతావరణానికి, సందడిగా ఉండే జీవనశైలి మధ్య  పిరి పీల్చుకునే గాలికి ప్రసిద్ది చెందింది. అయితే ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరం కూడా ఈ నగరమే…అయితే గ్రీన్ పీస్ సర్వే ప్రకారం.. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా 2020లో మూడవ చెత్త వాయు కాలుష్యాన్ని కలిగిన నగరాల జాబితాలో చేరింది. ఇది సుమారు 12,000 మరణాలకు కారణమైందని వారు తేల్చిన లెక్కలో బయట పడింది. ఉద్యానవనాలు, చెట్లు సమృద్ధిగా ఉన్న పచ్చని నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతున్న బెంగళూరు… భారతదేశంలో చెత్త కలుషితమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ నగర నుంచి ఉత్తరం వైపు వెళ్ళేటప్పుడు పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని వారి లెక్కలు చెబుతున్నాయి.

గ్రీన్ పీస్ నివేదిక ప్రకారం..  ఢిల్లీ ఇప్పటికీ చెత్త స్థానంలో టాప్ ప్లేస్ ను అక్రమించుకోగా…ముంబై ఆ తర్వాత స్థానంలో ఉంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే..  ఢిల్లీలో గత ఏడాది వాయు కాలుష్యంతో సుమారు 54,000 మంది మరణించారని గ్రీన్ పీస్ నివేదిక. వాయు కాలుష్యం కారణంగా ముంబైలో 25,000 మంది మరణించారని వారు నివేదికలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కోతి చేసిన పని.. ఇలా కూడా చేస్తాయా అంటూ నెటిజన్ల కామెంట్స్

Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..