Millionaire Australian Girl: తరచుగా పిల్లలు చిన్నప్పటి నుండి పెద్ద కలలు కనడం ప్రారంభిస్తారు. పిల్లలు తమ కలలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడతారు. సరైన సమయం వరకు వేచిచూసి విజయం సాధిస్తారు. చాలా మంది పిల్లలు సరైన సమయంలో ఈ కలను నెరవేర్చుకునేందుకు ఎక్కవు సమయం తీసుకుంటూ ఉంటారు. కానీ చాలా చిన్న వయస్సులోనే వారి కలను నెరవేర్చుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇలా విజయం సాధించిన పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా కూడా మారతారు. మనం అలాంటి పిల్లల కథను మీకు వివరించబోతున్నాం..
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఆస్ట్రేలియా నివాసి పిక్సీ కర్టిస్ అతి పిన్న వయసులోనే సంపన్నురాలుగా అవతరించింది. అయితే, పిక్సీస్ ఫిడ్జెట్స్ ఆఫ్ మిలియనీర్ పిక్సీ అనే కంపెనీ కూడా నిర్వహిస్తోంది. దీంతో ఆమెకు కోట్లలో ఆదాయం వస్తోంది. ఆమె తల్లి రాక్సీ కూడా ఈ పనిలో సహాయపడింది. ఆమె కూడా విజయవంతమైన పబ్లిక్ రిలేషన్స్ గురు రాక్సీ మేనేజర్ కావడం విశేషం.
ఈ చిన్నారి తన భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా సొంతంగా వ్యాపారం చేయాలని అలోచన చేసింది. ఇదే విషయాన్ని తొలుత తల్లికి చెప్పడంతో కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. కూతురు కోరిక మేరకు తల్లి రాక్సీ, కుమార్తె పిక్సీ మే నెలలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందుకోసం చాలా బొమ్మలను సేకరించి, విక్రయించడం ప్రారంభించారు. ఇలా వారి వ్యాపార ఆలోచన విజయవంతమైంది. అన్ని బొమ్మలు కేవలం 48 గంటల్లో అమ్ముడు పోవడం విశేషం. ఈ తొలి విజయంతో తల్లీ, కూతురు ఇద్దరూ చాలా సంతోషించారు.
ఈ విజయం తర్వాత, హెయిర్ యాక్సెసరీ బ్రాండ్‌ను కూడా సృష్టించారు. తమకంటూ ఓ సరికొత్త ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దానికి పిక్సీస్ బోస్ అని పేరు పెట్టారు. తల్లీకూతుళ్ల బొమ్మలు, బట్టలు, ఉపకరణాలు దీని ద్వారా విక్రయిస్తున్నారు. వీటన్నింటికీ 10 సంవత్సరాల పిక్సీ యాజమానిగా ఉండటం విశేషం. పిక్సీ తల్లి రాక్సీ కూడా విజయవంతమైన పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌గా వ్యవహరిస్తూ.. పిల్లలకు ఖరీదైన బహుమతులు, బట్టలు ఎలా ఉండాలి వాటి కోసం సలహాలు, సూచనలు ఇస్తూ పిక్సీ వ్యాపారానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఇంత చిన్న వయసులో పిక్సీలో వ్యాపారం చేయాలనే కోరిక ఉండేదని, నా సహకారంతో విజయం సాధించిందని పిక్సీ తల్లి చెబుతోంది. రాక్సీ స్వయంగా స్వెటీ బెట్టీ PR అనే విజయవంతమైన వ్యాపారాన్ని నడుపుతుంది. ఆమె భర్త ఆమెకు మద్దతునిస్తున్నారు.
Read Also… Corona Cases In Schools: స్కూల్స్ మూసివేస్తారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి.!