NASA Astronauts: అరుదైన అవకాశం.. నాసా చేపట్టబోయే వ్యోమగామి శిక్షణకు భారత సంతతికి చెందిన అనిల్ మీనన్ ఎంపిక..!
NASA Astronauts: అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) చేపట్టబోయే వ్యోమగామి (ఆస్ట్రోనాట్) శిక్షణ కార్యక్రమానికి ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎంపిక అయ్యారు. యూక్రెయిన్, భారతీయ..
NASA Astronauts: అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) చేపట్టబోయే వ్యోమగామి (ఆస్ట్రోనాట్) శిక్షణ కార్యక్రమానికి ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎంపిక అయ్యారు. యూక్రెయిన్, భారతీయ మూలాలున్న డాక్టర్ అనీల్ మీనన్ ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే ఇందు కోసం మొత్తం 12 వేల మంది దరఖాస్తు చేసుకోగా నాసా చివరికి 10 మందిని ఎంపిక చేసింది. వీరిలో అనీల్ మీనన్ కూడా ఒకరు. ఈయన వయసు 45 సంతవ్సరాలు. రెండు సంవత్సరాల పాటు సాగే ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం ఈ 10 మంది వివిధ అంతరిక్ష మిషన్లలో వ్యోమగాములుగా పాల్గొంటారు.
యూక్రేయిన్, భారత్ మూలాలున్న డాక్టర్ మీనన్ యూఎస్ లోని మిన్నెసొటా రాష్ట్రంలో జన్మించారు. గతంలో ఆయన స్పేస్ ఎక్స్ సంస్థలో ఫ్లైట్ సర్జన్‌గా సేవలందించారు. స్పెక్స్ సంస్థ చేపట్టిన డెమో-2 మిషన్‌లో పాలుపంచుకున్నారు. 2014లో ఆయన నాసాలో చేరారు. అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చెందిన నాలుగు దీర్ఘకాలిక మిషన్లలో డిప్యూటీ క్రూ సర్జన్‌గా పని చేశారు. అలాగే సోయూజ్ మిషన్లలో ప్రధాన క్రూ సర్జన్‌గా కూడా సేవలందించారు.
హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టా..
అనిల్ మీనన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 1995లో న్యూరోబయాలజీలో డిగ్రీ పట్టా పొందారు. 2004లో స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. అంతేకాకుండా అనిల్ మీనన్ స్టాన్‌ఫర్డ్ మెడికల్ స్కూల్ నుంచి మెడికల్ క్వాలిఫికేషన్ కూడా పొందారు. ఇక నాసా వివరాల ప్రకారం.. 2010లో హైతీ భూకంప సమంలో, అలాగే 2015నేపాల్ భూకంప సమయంలో, 2011 రెనో ఎయిర్‌షో ప్రమాద సమయంలో అనిల్ మీనన్ ముందుగానే స్పందించారు. ఆయన భార్య అన్నా మీనన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిల్ మీనన్ 2022 జనవరిలో నాసా ఆస్ట్రోనాట్ బృందంలో చేరి శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు.
ఇవి కూడా చదవండి: