AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Fruit Mango: అరటిపండు కాదు.. ఐస్‌క్రీమ్‌ కాదు.. ఇదో అమృతం మామిడిపండు కథ.. తింటే ఆహా అనాల్సిందే..

బనానా మ్యాంగో ఐస్‌ ఫ్రూట్‌. ఈ పేరెప్పుడైనా విన్నారా? పోనీ ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా? అరటిపండులా తొక్క ఒలవాలి. మామిడిపండు తిన్నట్లు తినాలి. మళ్లీ ఐస్‌ ఫ్రూట్‌లా ఆస్వాదించాలి. అది అరటిపండు కాదు. ఐస్‌క్రీమ్‌ కాదు. మామిడిపండే. ఏడాది పొడవునా దీన్ని ఆస్వాదించవచ్చు. దీన్ని ఆవిష్కరించింది ఓ తెలుగువాడు..

Ice Fruit Mango: అరటిపండు కాదు.. ఐస్‌క్రీమ్‌ కాదు.. ఇదో అమృతం మామిడిపండు కథ.. తింటే ఆహా అనాల్సిందే..
Amrutham Ice Fruit Mango
Shaik Madar Saheb
|

Updated on: Dec 18, 2024 | 11:40 AM

Share

చలికాలంలో ఎప్పుడైనా మామిడి పండ్లు తిన్నారా..? 24/7..365 డేస్ మధుర ఫలం మీకోసం సిద్ధం. అరటిపండులా తొక్క ఒలిచి, ఐస్‌క్రీమ్‌లా ఆరగించడం ఈ మ్యాంగో స్పెషాలిటీ. విశాఖలో పుట్టింది. దేశవిదేశాల వాసులను మెప్పించింది. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలామ్‌ను సైతం మెప్పించిన ఆ అమృతం మామిడి పండు కథ ఇది. విశాఖలో ఈ అమృతం మామిడిపండును జనం విపరీతంగా ఆస్వాదిస్తున్నారు. పిల్లాపెద్దా అంతా చలికాలంలో కూడా అమృతం లాంటి మామిడి ఐస్‌ ఫ్రూట్‌ను ఆరగిస్తున్నారు. ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అంటున్నారు.

గుంటూరుకు చెందిన కొంగర రమేష్.. హోమియో వైద్యుడు. దశాబ్దాల క్రితమే విశాఖకు వలస వచ్చేశారు. ఆయన శాస్త్రాలు చదవకపోయినా శాస్త్రవేత్తలకు మించి ఆవిష్కరణలు చేశారు. తనకున్న భూమిని లేబరేటరీగా మార్చి సరికొత్త మామిడి వంగడాలు సృష్టించారు. దాదాపు 20 రకాల సరికొత్త మామిడిపళ్ల వంగడాలను సృష్టించారు కొంగర రమేష్. వాటిలో ఒకటి ఈ అమృతం మామిడిపండు. ఆమ్రపాలి, చిన్న రసాల మధ్య క్రాస్ పరాగ సంపర్కం ద్వారా ఈ అమృతం మామిడిని సృష్టించారు. పేరులోనే కాదు టేస్ట్‌లో కూడా అమృతమే.

బంగారు వర్ణంలో మెరిసే ఈ అమృతం మ్యాంగో.. ఏళ్ల పాటు నిల్వ ఉంటుంది. అందుకే ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది ఈ మధుర ఫలం. ఫ్రీజర్ లో పెడితే చాలు.. ఏడాది తర్వాత అయినా ఫ్రెష్ ఫ్రూట్‌లా టేస్ట్‌ ఉంటుంది. దీన్నే ఐస్ ఫ్రూట్ మ్యాంగో అంటారు. ఎందుకంటే.. స్టిక్ లా పట్టుకొని.. అరటిపండులా తొక్కను ఒలుచుకొని తినేలా ఉంటుంది ఈ అమృతం ఐస్ ఫ్రూట్ మ్యాంగో. 2015లో జర్మనీలో జరిగిన ప్రపంచ ఉద్యాన ప్రదర్శనకు, ఈ ఐస్ ఫ్రూట్ మ్యాంగోఎంపికైంది. న్యూఢిల్లీలో జరిగిన ఆలిండియా హార్టికల్చరల్‌ ఎగ్జిబిషన్‌లో కూడా దీనిని ప్రదర్శించారు. విదేశీయులను సైతం ఈ రుచి మెప్పించింది.

వీడియో చూడండి..

కొంగర రమేష్‌కు ఈ అమృతం మ్యాంగో సృష్టించాలనే ఐడియా ఎందుకు వచ్చింది దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఇండియా పాకిస్తాన్‌, వాజపేయి, నవాజ్‌ షరీఫ్‌ ఇలాంటి పెద్దవాళ్ల పాత్రలు కూడా ఉన్నాయట. సో… ఓ ఐడియా ఇలా మ్యాంగో ఐస్‌ ఫ్రూట్‌ ఆవిష్కరణకు దారితీసింది.

అమృతం లాంటి తీయదనం.. ఏడాది తర్వాత తిన్నా అదే ఫ్రెష్ నెస్.. అప్పటికప్పుడు చెట్టు నుంచి తాజా పండును కోసి తిన్నట్టు ఉంటుంది ఆ టేస్ట్. ఎందుకంటే సహజ సిద్ధ సేంద్రియ ఎరువులతో పండిన పంటకు తోడు అమృతం మ్యాంగో వెరైటీ ప్రత్యేకత అటువంటిది. సరిగ్గా ఫ్రీజర్‌లో ఉంచితే.. ఆరేళ్ల పాటు నిల్వ ఉంటుంది. సో, విశాఖ వెళ్లినప్పుడు ఎంజాయ్‌ అమృతం మ్యాంగో ఐస్‌ఫ్రూట్‌.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..