Jeevan Pramaan Patra: నవంబర్ 30లోపు ఇది చేయకపోతే పెన్షన్ రాదు.. వృద్ధులు ఇంట్లో నుంచి ఇలా చేయండి..

| Edited By: Ram Naramaneni

Nov 27, 2023 | 8:30 PM

వృద్ధాప్యంలో అండగా నిలిచేది పెన్షన్. రిటైర్ అయిన తర్వాత వారి జీవితాన్ని సుఖమయం చేయడంలో ఈ పెన్షన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి నెలా వారు అందుకునే పెన్షన్ ఆధారంగా వారు మనుగడ సాధ్యమవుతుంది. అయితే మీరు సక్రమంగా పెన్షన్ పొందుకోవాలంటే ప్రభుత్వానికి పెన్షన్ లబ్ధిదారులు బతికే ఉన్నాడని నిర్ధారించే సర్టిఫికెట్ ఒకటి సమర్పించాల్సి ఉంటుంది.

Jeevan Pramaan Patra: నవంబర్ 30లోపు ఇది చేయకపోతే పెన్షన్ రాదు.. వృద్ధులు ఇంట్లో నుంచి ఇలా చేయండి..
Old Age
Follow us on

వృద్ధాప్యంలో అండగా నిలిచేది పెన్షన్. రిటైర్ అయిన తర్వాత వారి జీవితాన్ని సుఖమయం చేయడంలో ఈ పెన్షన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి నెలా వారు అందుకునే పెన్షన్ ఆధారంగా వారు మనుగడ సాధ్యమవుతుంది. అయితే మీరు సక్రమంగా పెన్షన్ పొందుకోవాలంటే ప్రభుత్వానికి పెన్షన్ లబ్ధిదారులు బతికే ఉన్నాడని నిర్ధారించే సర్టిఫికెట్ ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. ఇది 60 ఏళ్ల నుంచి 80ఏళ్ల వయస్సు ప్రతి పెన్షన్ లబ్ధిదారుడు సమర్పించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ పేరు జీవన్ ప్రమాణ్ పత్రా. ఈ పత్రాన్ని సమర్పించేందుకు ప్రభుత్వం గడువు విధించింది. ఆ గడువు నవంబర్ 30వ తేదీతో పూర్తయిపోతోంది. 80ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ పెన్షనర్లు కూడా ఇదే తేదీలోపు లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలోపు ఈ పత్రాన్ని సమర్పించకపోతే ఏమవుతుంది? పెన్షన్ ఆగిపోతుందా? అలా ఆగిపోతే ఎం చేయాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

నవంబర్ 30 తర్వాత కూడా..

మీరు నవంబర్ 30 లోపు మీ జీవన్ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించకపోతే, మీ పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది లేకుండా, మీ పెన్షన్ మొత్తం విడుదల కాదు. అయితే మీకు మరో ఆప్షన్ కూడా ఉంది. ఒక రకంగా ఇది రిలీఫ్ అని చెప్పొచ్చు. అదేంటంటే వచ్చే ఏడాది అక్టోబర్ 31లోపు మీరు మీ సర్టిఫికెట్‌ను సమర్పించినట్లయితే, మీ పెన్షన్ పునఃప్రారంభించబడుతుంది. అందుకోని మొత్తం బ్యాలెన్స్ కూడా మీకు తిరిగి అందిస్తారు.

జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఎలా సమర్పించాలంటే..

భారతదేశంలోని పెన్షనర్లు తమ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని 5 మార్గాల్లో సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆ పింఛనుదారులు జీవన్ ప్రమాణ్ పోర్టల్, ఫేస్ అథెంటికేషన్, పోస్ట్ పేమెంట్ బ్యాంక్, అధీకృత అధికారి సంతకం, డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా సమర్పించవచ్చు. 2023, నవంబర్ 1 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 100 నగరాల్లోని 500 ప్రదేశాలలో దేశవ్యాప్తంగా దీనిపై క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు. పదిహేడు పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులు, మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లు, పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, యూఐడీఏఐ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనిపై పని చేస్తున్నాయి. మీరు వారి సహాయంతో కూడా మీ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇంట్లో కూర్చొని కూడా సమర్పించొచ్చు..

మీరు మీ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని మీ ఇంటి నుంచి ఫేస్ అథంటికేషన్ లేదా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా సమర్పించవచ్చు. ఆ ప్రక్రియ గురించి ఇప్పుడు చూద్దాం..

  • 5ఎంపీ లేదా అంతకంటే ఎక్కువ రిజల్యూషన్ ఉన్న కెమెరా కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్ మీ దగ్గర ఉండాలి. దానిలో ఆధార్ ఫేస్ ఆర్డీ మీ(AadhaarFaceRD) ‘జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్’ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయాలి.
  • మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూటర్ అథారిటీకి ఇచ్చిన మీ ఆధార్ నంబర్‌ను మీ వద్ద ఉంచుకోవాలి.
  • ఆపరేటర్ అథంటికేషన్ కు వెళ్లి, మీ ముఖాన్ని స్కాన్ చేయండి.
  • ఆ తర్వాత మీ వివరాలను నమోదు చేయండి.
  • ఫోన్ ముందు కెమెరాతో మీ ఫోటోను తీసి షేర్ చేయండి. దీని తర్వాత, మీ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకునే లింక్ ఎస్ఎంఎస్ ద్వారా మీ ఫోన్‌కు వస్తుంది, దానిని మీరు డౌన్‌లోడ్ చేసి మీ వద్ద ఉంచుకోవచ్చు.

డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సాయంతో..

  • దీని కోసం, మీరు మొదటగా ఇంటి వద్దకే బ్యాంకింగ్ కోసం జీవన్ ప్రమాణ్ సెంటర్ లేదా మీ బ్యాంక్ సందర్శనను బుక్ చేసుకోవాలి.
  • ఆపరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు, అతనికి మీ ఆధార్, మొబైల్ నంబర్‌లను ఇవ్వాలి.
  • అతను బయోమెట్రిక్ పరికరంతో మీ ఐడీని ధ్రువీకరిస్తాడు.
  • అథంటికేషన్ పూర్తయిన తర్వాత, అది మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను రూపొందిస్తుంది. మీరు మీ కాపీని ఆపరేటర్ నుంచి తీసుకొని మీ వద్ద ఉంచుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..