Social Media Privacy: సోష‌ల్ మీడియాలో బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఈ వెబ్‌సైట్‌లో సింపుల్‌గా చెక్ పెట్టోచ్చు..

అయితే, ప్రస్తుత కాలంలో సోష‌ల్ మీడియా కాస్తా యాంటి సోష‌ల్‌గా మారుతుంది. మార్ఫింగ్ ఫోటోల‌తో బ్లాక్ మెయిల్ చేసే మాఫియా గ్యాంగులు పెరుతున్నాయి. ఫేస్‌బుక్‌, ఇంన్‌స్టాగ్రామ్ ల‌లో మ‌నం ఫ్రెండ్స్ కోసం పెట్టే ఫోటోల‌ను అర్టిఫిషియ‌న్ ఇంట‌లిజెన్స్‌తో మార్ఫింగ్ చేసి న్యూడ్ పిక్చర్లుగా మార్చి, మ‌హిళ‌ల‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ఇంట‌ర్నెట్ మాఫియా చేతిలో ల‌క్షలు పోగొట్టుకున్నవారు కొంద‌రైతే.. ఏం చేయ‌లేక అత్మహత్యలు చేసుకుంటున్నవారు మ‌రికొంద‌రు. అడిగినన్ని డ‌బ్బులు ఇవ్వక‌పోతే న్యూడ్ ఫోటోల‌ను వివిధ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేస్తున్నారు దుర్మార్గులు. ఇలాంటి వారిని పోలీసులు కూడా ఎం చేయ‌లేని ప‌రిస్థితి. ఒక్కోసారి నిందితుల‌ను అరెస్ట్ చేస్తున్నా..

Social Media Privacy: సోష‌ల్ మీడియాలో బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఈ వెబ్‌సైట్‌లో సింపుల్‌గా చెక్ పెట్టోచ్చు..
Photo Morphing Blackmail

Edited By:

Updated on: Aug 29, 2023 | 12:54 PM

మొబైల్ ఫోన్‌ను వినియోగించని వారు ఉన్నారా? అంటూ సమాధానం చెప్పడం చాలా కష్టం. ఏ ఒక్కరో ఇద్దరో తప్ప.. దాదాపు చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ నేటి కాలంలో సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. ఈ సోషల్ మీడియా కారణంగా ప్రపంచమే ఓ కుగ్రామంలా మారిపోయింది. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అందుకే సోషల్ మీడియా యూజర్ల సంఖ్య నానాటికి గణనీయంగా పెరిగిపోతోంది.

అయితే, ప్రస్తుత కాలంలో సోష‌ల్ మీడియా కాస్తా యాంటి సోష‌ల్‌గా మారుతుంది. మార్ఫింగ్ ఫోటోల‌తో బ్లాక్ మెయిల్ చేసే మాఫియా గ్యాంగులు పెరుతున్నాయి. ఫేస్‌బుక్‌, ఇంన్‌స్టాగ్రామ్ ల‌లో మ‌నం ఫ్రెండ్స్ కోసం పెట్టే ఫోటోల‌ను అర్టిఫిషియ‌న్ ఇంట‌లిజెన్స్‌తో మార్ఫింగ్ చేసి న్యూడ్ పిక్చర్లుగా మార్చి, మ‌హిళ‌ల‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ఇంట‌ర్నెట్ మాఫియా చేతిలో ల‌క్షలు పోగొట్టుకున్నవారు కొంద‌రైతే.. ఏం చేయ‌లేక అత్మహత్యలు చేసుకుంటున్నవారు మ‌రికొంద‌రు. అడిగినన్ని డ‌బ్బులు ఇవ్వక‌పోతే న్యూడ్ ఫోటోల‌ను వివిధ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేస్తున్నారు దుర్మార్గులు. ఇలాంటి వారిని పోలీసులు కూడా ఎం చేయ‌లేని ప‌రిస్థితి. ఒక్కోసారి నిందితుల‌ను అరెస్ట్ చేస్తున్నా.. అప్పటికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రుగుతుంది. కొంతమంది భాధితులు పోలీసుల‌కు కూడా చెప్పుకోలేరు. ఉన్న ప‌రిమిత వ‌న‌రుల‌తో అటు పోలీసులు కూడా ఇలాంటి నేరాల‌కు అడ్డుక‌ట్టవేయ‌లేక‌పోతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో భాదిత మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలుస్తుంది ఓ వెబ్‌సైట్‌. మీ ఫోటోల‌ను ఎవ‌రైనా న్యూడ్‌గా త‌యారుచేసి అన్‌లైన్లో అప్‌లోడ్ చేస్తే వెంట‌నే మీరు stopncii.org అనే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. మీ వివ‌రాలు, మీ ఒరిజిన‌ల్ ఫోటో, మార్పింగ్ చేసిన ఫోటోను అప్లోడ్ చేస్లే చాలు.. అంతే మెత్తం క‌థంతా వాళ్లే చూసుకుంటారు. కొద్ది గంట‌ల్లోనే ఇంట‌ర్‌నెట్లో ఉన్న అన్ని సోష‌ల్ మీడియా సైట్లతో మీ మార్ఫింగ్ పిక్స్ డిలిట్ చేస్తారు. అది కూడా ఉచితంగా. అంతేకాదు మీ వివ‌రాలు కూడా ర‌హ‌స్యంగా ఉంచుతారు. సో ఇక న్యూడ్ ఫోటోలు పెడ‌తామంటు ఎవ‌రైనా బ్లాక్‌మెయిల్ చేస్తే ముందుగా ఈ వెబ్‌సైట్‌ని సంప్రదించండి. అలాగే బయ‌ప‌డ‌కుండా పోలీసుల‌కు ఫిర్యాదు చేయండి.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..