Viral Video: 8 ఏళ్ల వయసుకే ఆటోతో పాటు కుటుంబాన్ని కూడా నడిపిస్తున్నాడు.. ఈ చిన్నోడి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

|

Sep 02, 2021 | 5:29 PM

హాయిగా ఆడుకోవాల్సిన వయసులో ఆ బుడ్డోడికి అనుకోని కష్టం వచ్చి పడింది. ఎనిమిదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలను మోయాల్సిన పరిస్థితి...

Viral Video: 8 ఏళ్ల వయసుకే ఆటోతో పాటు కుటుంబాన్ని కూడా నడిపిస్తున్నాడు.. ఈ చిన్నోడి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు
8 Years Kid
Follow us on

హాయిగా ఆడుకోవాల్సిన వయసులో ఆ బుడ్డోడికి అనుకోని కష్టం వచ్చి పడింది. ఎనిమిదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలను మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కన్నవారి కడుపు నింపేందుకు..ఆ బుడతడు ఆటో డ్రైవర్‌ అవతారమెత్తాడు..ఆటో సీట్లో సరిగా కూర్చుంటే కాళ్లు కూడా కిందకు అందవు. కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నోడు ఆటో నడపాల్సి వస్తోంది. ఇంతకీ ఎవరా బుడ్డొడు..ఏంటా కథ..? తెలుసుకుందాం పదండి.

ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో ఓ యువకుడు కారులో వెళ్తున్నాడు. వెళ్లే దారిలో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బ్యాటరీ ఆటోను చూశాడు. ఆటో నడిపే వ్యక్తిన చూసిన ఆ యువకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ బ్యాటరీ ఆటో నడుపుతోంది యువకుడో, వృద్ధుడో, మహిళో కాదు… ఎనిమిదేళ్ల చిన్నోడు రాజగోపాల్ రెడ్డి. పసివాడైన రాజగోపాల్ రెడ్డి ఆటో నడపడాన్ని గుర్తించిన ఆ యువకుడు వెంటనే అక్కడ ఆగిపోయి ఇంత చిన్న వయసులో ఎందుకు ఆటో నడుపుతున్నావ్ అని ఆరా తీయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన పాపిరెడ్డి, రేవతి దంపతులకు ముగ్గురు మగపిల్లలు. కానీ ఆ దంపతులిద్దరికీ కళ్లు కనిపించవు. తల్లిదండ్రులు అంధులు కావడంతో.. పెద్ద కొడుకైన ఎనిమిదేళ్ల గోపాల్ రెడ్డి.. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. బ్యాటరీ ఆటో నడుపుతూ గ్రామంలో పప్పులు, బియ్యం అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు… ఇంత చిన్నపిల్లాడు ఆటో నడిపే క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. మరో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ చిన్నోడు ఆటో నడుపుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: బ్లడ్ బ్యాంక్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 8 నెలల చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తం.. ఆపై

బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్