చాలా ప్రాంతాలలో మునక్కాయను శాకాహారుల మాంసాహారంగా పిలుస్తారు. అందుకు దానిలోని పోషకాలు, దాని వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలే కారణం. వివిధ రకాల వంటలలో విరివిగా వాడుకునే మునక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునక్కాయ కూడా ఒకటి. ఇక మునక్కాయ చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడేవే. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉంటాయి. మునక్కాయ రుచిలో ఎంతో కమ్మనిది. అంతేకాదు ఇందులో మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి.
శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి మునక్కాయ ఎంతగానో దోహదపడుతుంది. మునగలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మునగ చెట్టు ఆకులు, కాయలని కూరలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు అనేక వ్యాధులను నయం చేస్తాయి. మునగకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..