Nutrition Food Tips: మీ ఆహారంతో వీటిని తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

|

Oct 30, 2022 | 2:18 PM

డైట్ లో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలనే దానిపై చాలా మందికి స్పష్టత ఉండదు. దీంతో ఏదో ఒకటి తినేస్తాం. మనం తినే ఆహారంలో కొన్ని పదార్థాలు జోడిస్తే..

Nutrition Food Tips: మీ ఆహారంతో వీటిని తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Nutration Food
Follow us on

ఎంత సంపాదించినా.. ఏం చేసినా మంచి ఆరోగ్యం కోసమే.. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. చాలా మంది వ్యక్తులు తమ సంపాదనలో ఎక్కువ భాగం తిండిపైనే పెడతారు అనేది బహిరంగ రహస్యం. మన రోజూవారి డైట్ లో పౌష్టికాహారం తీసుకోవాలని అందరూ అనుకుంటుంటారు. అయితే మన డైట్ లో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలనే దానిపై చాలా మందికి స్పష్టత ఉండదు. దీంతో ఏదో ఒకటి తినేస్తాం. మనం తినే ఆహారంలో కొన్ని పదార్థాలు జోడిస్తే అవసరమైన పోషకాహారం తీసుకున్నట్లే అన్ని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన, పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల వివిధ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని వివిధ అధ్యయనాల్లో తేలాయి. సాధారణ వ్యాయామంతో పాటు ఈ ఆహారం మన వెయిట్ ను బ్యాలెన్స్ చేసుకోవడంలోనూ దోహదపడుతుంది. చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎన్నో ఉత్పత్తులను సైతం వాడుతూ ఉంటారు. అయితే కేవలం మనం రోజూ తినే ఆహారంలో మనకు అందుబాటులో ఉండే పదార్థాలను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అవెంటో తెలుసుకుందాం.

ఎటువంటి పదార్థాలు తీసుకోవాలి

కొవ్వు కలిగిన అన్ని పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగించవు. కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి పోషకాహారాన్ని అందించి మంచి ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడతాయి. పాల ఉత్పత్తుల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు హానికరమైనవి. కానీ కూరగాయల నూనెలు, తృణధాన్యాలు, చేపల్లో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ వంటి కొవ్వులు అందుతాయి. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగాలు. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి అవసరం. ఈ రెండు రకాల కొవ్వుల వినియోగం హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కార్బోహైడ్రేట్లు

మనం రోజు తీసుకునే కార్బోహైడ్రేట్‌లో ఎక్కువ భాగం రోటీలు, బ్రెడ్‌ల నుంచి అందుతాయి. ఇవి అత్యంత ప్రాసెస్ చేసిన ధాన్యాల నుంచి తయారు చేస్తారు. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మేలు చేయవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, బీన్స్‌తో పాటు తృణధాన్యాల నుంచి తయారైన ఆహారాలు మంచివి. ఇవి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్‌లతో కూడిన నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్‌లను అందిస్తాయని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

ప్రోటీన్లు ఉండే ఆహారం

అత్యధికంగా ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకునేటప్పుడు గుడ్లు, చికెన్, చేపలు, ఆకు కూరలు వంటివి మన డైట్ లో జోడించుకోవడం మంచిది. అయితే చికెన్, గుడ్లు, చేపలు వంటివి మితంగానే తీసుకోవాలి.

నీరు

మంచినీళ్లు శరీరానికి అవసరమైన వాటిలో చాలా ముఖ్యం. H2oలో ఎలాంటి కేలరీలు ఉండవు. కాబట్టి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం మంచిది. సోడాలు, పండ్ల పానీయాలు, జ్యూస్‌లు, స్పోర్ట్స్ డ్రింక్స్, ఆల్కహాలిక్ డ్రింక్స్ వంటి పానీయాలకు దూరంగా ఉండాలి. చక్కెర పానీయాలు రోజు తీసుకుంటే.. బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..