Health Tips: రోజుకు మీరు ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నారు ?.. ఇంతకీ నీరు ఎంత శాతం తాగితే అద్భుత ప్రయోజనాలో తెలుసా..

|

May 03, 2022 | 9:44 PM

Health Benefits of Water: మనం తాగే నీరు ఔషధం. అవును.. నీరు ఎంత తాగితే.. అంత మంచిది. శరీరంలోని అన్ని జీవక్రియలకు నీరు ఎంతో ముఖ్యం..

Health Tips: రోజుకు మీరు ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నారు ?.. ఇంతకీ నీరు ఎంత శాతం తాగితే అద్భుత ప్రయోజనాలో తెలుసా..
Drinking Water
Follow us on

భూమిలో 70 శాతం నీటితో కప్పబడి ఉంది. అయితే ఈ నీటిలో 70 శాతం తాగడానికి సరిపోతుందని దీని అర్థం కాదు. భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో 50 శాతం కంటే ఎక్కువ గృహాలు ఇప్పటికీ త్రాగడానికి తమ నీటిని మరిగించడంపై ఆధారపడి ఉన్నాయి. మీ శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. ఈ నీరు మీ శరీరంలో ఉన్న మురికిని మూత్రం, చెమట మొదలైన వాటి ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది. రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని చెబుతున్నారు. నీరు శరీరానికి చాలా ముఖ్యమైనది. మీ శరీరానికి సరిపడేంతవరకు నీరు తాగడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. అయితే చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తీసుకుంటారు. ఇది శరీరంలో నీటి నష్టాన్ని పెంచుతుంది.

శక్తి స్థాయిని ఇవ్వడంలో..

వేసవిలో మన శరీరంలో ఎనర్జీ లెవల్లో తగ్గినట్లుగా అనిపిస్తుంది. వీటన్నింటి నుంచి బయటపడేందుకు సులువైన మార్గం నీరు ఎక్కువగా తాగడం. ఇలా చేయడం ద్వారా మీరు మీ రోజును అదనపు బలంతోపాటు శక్తితో గడపగలుగుతారు.

డీహైడ్రేషన్‌కు ఇలా చెక్..

నీటి తక్కుగా తాగడం వల్ల మెదడుపై చెడు ప్రభావం చూపుతుంది. మీ మెదడు అలసిపోయినప్పుడు.. మీ కండరాలు స్పందించడం నిలిచిపోతాయి. మీ కళ్ళు అలసిపోతాయి. మీ మెదడుకు ముఖ్యమైన పనులు చేసే శక్తి తగ్గిపోతుంది. మీరు కోరుకున్నప్పటికీ మీరు పనిపై దృష్టి పెట్టలేరు. కాబట్టి దీనిని నివారించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. మీరు డ్రింక్-వాటర్ యాప్‌ని ఉపయోగించి మీరు ఒక రోజులో ఎన్ని లీటర్ల నీటిని వినియోగించారో తెలుసుకోవచ్చు.

మీ మూడ్ ఫ్రెష్ గా ఉండేందుకు..

మీకు దాహం అనిపించినప్పుడు చాలా చిరాకుగా ఉంటారు. ఒక గ్లాసు నీరు త్రాగడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు.. అంతేకాదు మానసిక స్థితి కూడా చక్కగా ఉంటుంది.

నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది

పౌష్టికాహారంతో పాటు బరువును తగ్గించడంలో నీరు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. నీరు కేలరీలను తగ్గిస్తుంది. ఇది మీ ఆకలిని అణచివేయడం ద్వారా జీవక్రియను పెంచుతుంది. తద్వారా మీకు తక్కువ ఆకలిని కలిగిస్తుంది.

చర్మాన్ని అందంగా ఉంచడంలో సహాయపడుతుంది

నీరు తక్కువగా తీసుకోవడం వల్ల మీ చర్మం పొడిబారుతుంది. త్వరగా ముడతలు వస్తాయి. అందువల్ల, ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు పుష్కలంగా నీరు త్రాగాలి. మన మొత్తం శరీరంకు సరైన పనితీరుకు నీరు చాలా ముఖ్యమైనది. కాబట్టి మనకు దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగడం సరిపోదు. ఇందుకు బదులుగా, ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగడం మంచిది.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..

Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ గాంధీ రాజకీయ “అపరిపక్వత”..?