AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టబోయే బిడ్డకు అంగవైకల్యం ఉండొద్దంటే.. గర్భిణీలు ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే

వైద్యులు సైతం పలు సూచనలు చేస్తుంటారు. అయితే తెలిసో తెలియకో చేసే కొన్ని పనులు పుట్టబొయే చిన్నారుల్లో అంగవైకల్యానికి కారణమతుంటుంది. ఓ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది పిల్లలు వైక్యలంతో పుడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. ఇంతకీ పుట్టబోయే పిల్లలు అంగ వైకల్యంతో..

పుట్టబోయే బిడ్డకు అంగవైకల్యం ఉండొద్దంటే.. గర్భిణీలు ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే
Pregnancy Women
Narender Vaitla
|

Updated on: Jan 15, 2024 | 6:50 PM

Share

పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ప్రతీ ఒక్క తల్లి కోరుకుంటుంది. అందుకోసం మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామాలు చేస్తుంటారు. వైద్యులు సైతం పలు సూచనలు చేస్తుంటారు. అయితే తెలిసో తెలియకో చేసే కొన్ని పనులు పుట్టబొయే చిన్నారుల్లో అంగవైకల్యానికి కారణమతుంటుంది. ఓ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది పిల్లలు వైక్యలంతో పుడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. ఇంతకీ పుట్టబోయే పిల్లలు అంగ వైకల్యంతో ఎందుకు జన్మిస్తారు.? ఇలాంటి పొరపాటు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఇప్పుడు తెలుసుకుందాం.

* గర్భధారణ సమయంలో తల్లీ, బిడ్డలు ఇద్దరికీ సమతుల్య, పోషకమైన ఆహారం చాలా ముఖ్యం. ప్రతిరోజూ, మీ ఆహారంలో పప్పులు, పచ్చి కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన ధాన్యాలు, నట్స్‌, పాలు, పెరుగు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ మీ శరీరానికి ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. పిల్లల సరైన అభివృద్ధికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

* గర్భిణీలు కచ్చితంగా ఫోలిక్‌ యాసిడ్‌ను తీసుకోవాలి. ఐరన్‌, కాల్షియం సప్లిమెంట్స్ కచ్చితంగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫోలిక్ యాసిడ్ పిల్లల మెదడు, వెన్నుపాము అభివృద్ధికి సహాయపడుతుంది. బిడ్డ, తల్లి ఎముకలకు ఐరన్, కాల్షియం చాలా అవసరం.

* గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారంతో పాటు కొన్ని రకాల పరీక్షలను సైతం కచ్చితంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల బిడ్డ పుట్టబోయే ముందు అంగవైకల్యం ఏమైనా ఉంటే గుర్తించవచ్చు. ఈ పరీక్షల్లో ప్రధానమైవని.. డబుల్ మార్కర్ టెస్ట్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్ చాలా ముఖ్యమైనవి. ఈ పరీక్షలు పిండంలో ఏదైనా జన్యుపరమైన అసాధారణత లేదా రుగ్మతను గుర్తించడంలో సహాయపడతాయి.

* గర్భం దాల్చిన 11వ, 13వ వారం మధ్య డబుల్ మార్కర్ పరీక్ష జరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన వ్యాధులను గుర్తించడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది. ట్రిపుల్ మార్కర్ పరీక్ష 16వ వారం నుంచి 18వ వారం వరకు జరుగుతుంది. అలాగే డౌన్ సిండ్రోమ్‌తో సహా ఇతర జన్యుపరమైన రుగ్మతలను గుర్తించడంలో ఇది సహాయకరంగా ఉంటుంది. దీంతో పుట్టబోయే బిడ్డ ఎలాంటి వైకల్యాన్ని అయినా గుర్తించవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..