AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: డెలివరీ తరువాత స్త్రీలు ఎందుకు డిప్రెషన్‌కు గురవుతారు? వైద్యులు చెబుతున్న కీలక సూచనలు మీకోసం..

Shiva Prajapati
|

Updated on: Aug 13, 2023 | 11:14 AM

Share

తల్లి కావడం ఒక మధురమైన అనుభూతి. ఒక స్త్రీ తల్లి అయినప్పుడు.. ఆమెలో కలిగే ఆనందం, ఆ అనుభూతి వర్ణించలేనిది. ఆ సమయం, ఆ క్షణం స్త్రీకి చా భిన్నమైనది, ప్రత్యేకమైనది. అయితే, తల్లి అయిన తరువాత కొంతమంది స్త్రీలు విచారంతో ఉంటారు. నిరంతరం ఆందోళన, ఉద్రిక్తతకు గురవుతారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఏమిటి? నిజానికి కొంతమంది మహిళలు ప్రసవానంతర డిప్రెషన్‌కు గురవుతారు. శరీరంలో మార్పులు, కొత్త బాధ్యతల ఒత్తిడి వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువగా..

తల్లి కావడం ఒక మధురమైన అనుభూతి. ఒక స్త్రీ తల్లి అయినప్పుడు.. ఆమెలో కలిగే ఆనందం, ఆ అనుభూతి వర్ణించలేనిది. ఆ సమయం, ఆ క్షణం స్త్రీకి చా భిన్నమైనది, ప్రత్యేకమైనది. అయితే, తల్లి అయిన తరువాత కొంతమంది స్త్రీలు విచారంతో ఉంటారు. నిరంతరం ఆందోళన, ఉద్రిక్తతకు గురవుతారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఏమిటి? నిజానికి కొంతమంది మహిళలు ప్రసవానంతర డిప్రెషన్‌కు గురవుతారు. శరీరంలో మార్పులు, కొత్త బాధ్యతల ఒత్తిడి వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కానీ కొంతమంది మహిళలకు ఈ విషయం తెలియదు. తమకు ఇలా ఎందుకు జరుగుతుందో వారు గుర్తించలేకపోతున్నారు. ప్రస్తుత కాలంలో ప్రసవానంతర డిప్రెషన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రసవానంతర ఆందోళన గర్భధారణ సమయంలో, బిడ్డ పుట్టిన ఒక సంవత్సరం వరకు అలాగే ఉంటుంది. గర్భధారణ సమయంలో స్త్రీకి మానసిక సమస్యలు ఉంటే ప్రసవానంతరం డిప్రెషన్ కూడా వస్తుంది. గర్భధారణ సమయంలో అనేక శారీరక మార్పులు, మానసిక మార్పులు వస్తాయని డాక్టర్స్ చెబుతున్నారు. దీని ద్వారా శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు. దీంతో పాటు పిల్లల సంరక్షణ వంటి ఎన్నో కొత్త బాధ్యతలు కూడా మదిలో మెదులుతాయి. ఈ విషయాలు వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితిలో స్త్రీలకు కమోడ్ స్వింగ్స్ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే ఏడవడం మొదలు పెడతారు. ఆందోళనలో జీవిస్తున్నారు. దీనినే బేబీ బ్లూస్ అంటారు. ఇది డెలివరీ తర్వాత రెండు రోజులు లేదా ఒక వారం పాటు ఉంటుంది.

ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు..

ప్రసవానంతరం చాలా మంది మహిళల్లో ఆందోళనలు కలుగుతాయి. అన్ని వేళలా విచారంగా ఉంటారు. అలిసిపోయినట్లుగా ఉంటారు. నిద్ర పట్టదు, ఆకలి అనిపించదు. ఎందులోనూ సంతోషం దొరకదు. విషయాలపై దృష్టి పెట్టలేరు. పిల్లల సంరక్షణలో ఆసక్తి చూపరు. ఈ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు కూడా మనస్సులో మెదులుతాయి. ఇవన్నీ ప్రసవానంతర డిప్రెషన్‌కు సంకేతాలుగా పేర్కొంటున్నారు వైద్యులు.

ప్రసవానంతర డిప్రెషన్ ఎందుకు వస్తుంది?

అవాంఛిత గర్భం, సంక్లిష్టమైన గర్భం, లేదా గతంలో ఏదైనా మానసిక ఆరోగ్య సంబంధిత అనారోగ్యం ఉంటే.. అప్పుడు ప్రసవానంతర డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగితే. ఉదాహరణకు, ఎవరైనా చనిపోవచ్చు, ఉద్యోగం కోల్పోవచ్చు. ఇది కాకుండా, భావోద్వేగ, శారీరక, ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే.. ప్రసవానంతర డిప్రెషన్ ఉండవచ్చు. చాలా సార్లు డెలివరీ తర్వాత సపోర్ట్ లేకపోవడం, ప్రసవానంతర డిప్రెషన్ కూడా రావచ్చు.

ప్రసవానంతర డిప్రెషన్‌ను ఎలా నివారించాలి..

ఇప్పటికే డిప్రెషన్ లక్షణాలు ఉంటే.. వెంటనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి.. రిలాక్స్ అవ్వాలి. డాక్టర్‌తో మాట్లాడి చికిత్స తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. ఎంత త్వరగా అలర్ట్ అయితే మీకు, మీ పిల్లలకు అంత మంచిది. అలాగే మీ సంబంధాలపైనా మంచి ప్రభావం ఉంటుంది. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Published on: Aug 13, 2023 09:58 AM