Asthma: మీకు ఆస్తమా ఉందా? అయితే చలి కాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఏమాత్రం చలి వాతావరణానికి వారు ఎక్సపోజ్ అయినా వెంటనే వారిపై ఫ్లూ ప్రభావం చూపుతుంది. ఫలితంగా గొంతునొప్పి, ముక్క కారడం వంటి సమస్యలతో పాటు శ్వాస సక్రమంగా ఆడక ఇబ్బందులు పడతారు.

శీతాకాలం.. ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ చాలా మంది కష్టపడతారు. ఎందుకంటే ఈ సమయంలో వీచే చలి గాలులు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పైగా ఈ ఏడాది చలి తీవ్రత బాగా ఉంది. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో చలిపులి చంపేస్తోంది. ఈ క్రమంలో పలు ఫ్లూ వైరస్ లు ఈ సమయంలోనే విజృంభిస్తాయి. ఫలితంగా చాలా మంది దగ్గు, జలుబు వంటి వాటితో సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆస్తమా, ఉబ్బసం ఉన్నవారు నరకం చూస్తారు. ఏమాత్రం చలి వాతావరణానికి వారు ఎక్సపోజ్ అయినా వెంటనే వారిపై ఫ్లూ ప్రభావం చూపుతుంది. ఫలితంగా గొంతునొప్పి, ముక్క కారడం వంటి సమస్యలతో పాటు శ్వాస సక్రమంగా ఆడక ఇబ్బందులు పడతారు. ఈ నేపథ్యంలో ఈ వింటర్ సీజన్ ఆస్తమాను ప్రేరేపించే వి అలాగే వాటిని నియంత్రించే సాధనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్తమా రోగులు చేయాల్సింది ఇది..
ఆస్తమా రోగులు చల్లని గాలికి ఎక్కవగా ఎక్స్ పోజ్ కావడం వల్ల శ్వాసనాళాలు సంకోచం చెంది మూసుకుపోతాయి. ఫలితంగా ఊపిరి సక్రమంగా ఆడక ఇబ్బందులు పడతారు. ఇలాంటి సమయంలో మొదటగా చేయవలసినది ఏంటంటే.. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినప్పుడు బయట ఎక్కువగా వెళ్లకుండా ఎండ సమయంలోనే బయట పనులు చూసుకోవాలి. అర్థరాత్రి, తెల్లవారుజాము సమయాల్లో బయటకు వస్తే మీ ముక్కు, నోటిని కవర్ చేసుకోవాలి. అలాగే మీ డాక్టర్ సిఫార్సు ప్రకారం ఒక ఇన్హేలర్ దగ్గర పెట్టుకోవాలి. మీ డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్ ఇన్హేలేషన్ థెరపీ తీసుకుంటూ ఉండాలి. అంతేకా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి పీక్ ఫ్లో మీటర్ కూడా ఉపయోగించవచ్చు. పీక్ ఫ్లో మీటర్ ఊపిరి పీల్చుకునేటప్పుడు ఊపిరితిత్తుల నుంచి గాలిని ఎంత వేగంగా నెట్టగలరో అంచనా వేస్తుంది. ఇది మీ ఊపిరితిత్తుల బలాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
ఉబ్బసం ఉన్న వారు మరింత జాగ్రత్తగా..
ఉబ్బసం ఉన్న రోగుల్లో చలికాలం వాతావరణం కారణంగా ఆస్తమా తీవ్రతరం కావచ్చు. ఈ సమయంలో ఫ్లూ వ్యాపిస్తే ఆస్తమా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అధిక కాలుష్య స్థాయిలు (అవుట్‌డోర్, ఇండోర్ కాలుష్యం) బయట పొగమంచు కారణంగా కూడా ఆస్తమా తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. దీనిని నివారించడానికి శీతాకాలం ప్రారంభానికి ముందు వార్షిక ఇన్ ఫ్లూఎంజా టీకాలు వేసుకోవాలి. అలాగే కోమోర్బిడిటీలతో బాధపడుతున్న వృద్ధ రోగులు, అలాగే, ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారు బయటకు వెళ్లే టప్పుడు తప్పనిసరిగా ముసుగులు ధరించాలి. సరైన చేతి పరిశుభ్రతను పాటించాలి. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులకు అంటు వ్యాధులు శోకకుండా కాపాడవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..