Winter Problems: చలికాలంలో ఈ నాలుగు అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు పాటించండిలా..!

|

Oct 24, 2022 | 8:24 AM

Winter Problems: చలికాలం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఈ కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముందస్తు..

Winter Problems: చలికాలంలో ఈ నాలుగు అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు పాటించండిలా..!
Winter Problems
Follow us on

Winter Problems: చలికాలం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఈ కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముందస్తు చర్యల వల్ల ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా జలుబు-దగ్గు, జ్వరం ఉంటూనే ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఎక్కువగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. జలుబు, ఫ్లూ సమయంలో అలసట, నీరసం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఎక్కువగా వస్తాయి.

  1. కీళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చలికాలపు మరింతగా ఎక్కువ చేస్తుంది. చల్లటి వాతావరణం వల్ల వారి సమస్య కూడా పెరుగుతుంది. శీతాకాలంలో వాతావరణ పీడనం తగ్గడం వల్ల శరీరంలోని పెన్ గ్రాహకాలు మరింత సున్నితంగా మారుతాయి. దీని వల్ల కీళ్లలో వాపులు వచ్చి నొప్పి ఎక్కువవుతుంది. దీంతో ఆ వ్యక్తులు ఎక్కువగా బాధపడుతారు.
  2. చెవి సమస్యలు చలికాలంలో చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంటుంది. ఈ పరిస్థితిలో నొప్పి ఎక్కువ కాకముందే వైద్యులను సంప్రదించండం ఎంతో మంచిది.
  3. బ్రోన్కియోలిటిస్ చిన్నపిల్లలు, శిశువులకు బ్రోన్కియోలిటిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో శ్లేష్మం ఏర్పడుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది అందుకే కాస్త జాగ్రత్తలు వహించడం మంచిదంటున్నారు వైద్యులు.
  4. బలహీనమైన రోగనిరోధక శక్తి బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్యలు ఎదురవుతాయి. వీటిని నిరోధించడానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం అవసరం. ఎక్కువగా తులసి కషాయాలను తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా చేయాలి. చలి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులను ధరించాలి. బయటి ఆహారం తినడం మానుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినాలి. ఇలా జాగ్రత్తలు పాటిస్తూ చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి