Curd in Winter: శీతాకాలంలో పెరుగుతింటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

|

Dec 09, 2022 | 12:15 PM

Winter and Curd: శీతాకాలం వస్తే మాత్రం పెరుగును చాలామంది దూరంపెడతారు. జలుబు చేస్తుందనో, దగ్గు ఎక్కువ అవుతుందనో తినడానికి భయపడతారు. అయితే ఇది నిజమేనా? శీతాకాలంలో పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి అంత నష్టమా?

Curd in Winter:  శీతాకాలంలో పెరుగుతింటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Curd in Winter Season
Follow us on

పంచభక్షపరమాన్నాలు ఉన్నా.. చివరిలో పెరుగు లేకపోతే ఆ భోజనం పరిపూర్ణం కాదు అంటుంటారు పెద్దలు.. నిజమే తెలుగు సమాజంలో పెరుగుకు అంత ప్రాధాన్యం ఉంది. అయితే శీతాకాలం వస్తే మాత్రం పెరుగును చాలామంది దూరంపెడతారు. జలుబు చేస్తుందనో, దగ్గు ఎక్కువ అవుతుందనో పెరుగును తినడానికి భయపడతారు. అయితే ఇది నిజమేనా? శీతాకాలంలో పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి అంత నష్టమా? లేక లేనిపోని అపోహలతో అనవసరంగా శరీరానికి మేలు చేసే పెరుగును దూరం పెడుతున్నామా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పెరుగును శీతాకాలంలో చాలా మంది తినడం మానేస్తారు. దానికి అనేకానేక కారణాలు చెబుతారు. అయితే నిపుణులు మాత్రం పెరుగు తినడం మానొద్దని నొక్కి చెబుతున్నారు. శరీరానికి మంచి చేసే లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియాను సమకూర్చే పెరుగును ప్లేట్ నుంచి దూరం చేయొద్దని సూచిస్తున్నారు.

బహుళ ప్రయజనాలు..

పెరుగు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ఉపకారిగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగు తినడం ద్వారా మేగ్నీషియం, జింక్, విటమిన్ డీ వంటివి శరీరానికి పుష్కలంగా అందుతాయి. తద్వారా వైరల్ ఇన్ ఫెక్షన్స్ ను తట్టుకునే శక్తిని శరీరానికి వస్తుంది.

ఇవి కూడా చదవండి

అలాగే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. కడుపులో ఇన్ ఫెక్షన్స్ తగ్గించి, డయేరియా వంటి రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది. అదే విధంగా పెరుగు అధికంగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. ఇది వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కు ఉపకరిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని కొవ్వును అదుపులో ఉంచి లోవర్ బాడీ వెయిట్ ను తగ్గించేందుకు సాయపడుతుంది.

కొన్ని అపోహలు..

శీతాకాలంలో పెరుగు తినకూడదు.. రాత్రి పూట పెరుగు తీసుకోకూడదు.. బాలింతలు పెరుగుకు దూరంగా ఉండాలి వంటి అపోహలు చాలానే ఉన్నాయి. అయితే ఇది వాస్తవం కాదని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో సమపాళ్లలో పెరుగు తీసుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. జలుబు, దగ్గు వంటి ఫ్లూలను నిరోధిస్తుంది. అలాగే రాత్రి పూట పెరుగు తగు మోతాదులో తీసుకోవడం ద్వారా మెదడును రిలాక్స్ చేసి ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవాడానికి ఉపయోగపడుతుంది.

ఇక బాలింతలు కూడా రాత్రి పూట పెరుగు తినడం ద్వారా ఉపయోగమే గానీ నష్టం లేదని నిపుణులు చెబుతున్నారు. పాలిచ్చే బాలింతలు దీనిని తీసుకోవడం ద్వారా బిడ్డ శరీరానికి సాధారణ వైరస్‌లు, క్రిములను తట్టుకునే శక్తినిస్తుందని వివరిస్తున్నారు.
ఇదండీ సంగతీ.. చదివారుగా పెరుగుతో నష్టాల కంటే లాభాలే ఎక్కువ. కాబట్టి శీతాకాలం పేరుతో వంటింటి నుంచి పెరుగును బహిష్కరించకుండా.. రోజూ తగుమోతాదులో పెరుగు తింటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరిన్ని హెల్త్ వార్తలు చదవండి