ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరర్చుకోవాలంటే పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అప్పుడే రోజంతా మనం ఎనర్జిటిక్‌గా ఉంటాం. పనితీరు కూడా మెరుగుపడుతుంది. అయితే శీతాకాలమొచ్చిందంటే చాలు చాలామందికి బద్ధకం ఆవహిస్తుంది. పొద్దున నిద్ర లేచింది మొదలు, ఆఫీసులో పనుల దాకా అన్నింటిపై అనాసక్తి ఏర్పడుతుంది. ఈక్రమంలో శీతాకాలంలో రోజంతా ఎనర్జిటిక్‌గా, హెల్దీగా ఉండటానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఈ ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయులను నిర్వహించడానికి సహాయపడతాయి. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అజీర్తి, మలబద్ధకం సమస్యల నుండి బయటపడటానికి కూడా పని చేస్తాయి. మరి ఆ సూపర్‌ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం రండి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.అజీర్తి మలబద్ధకం మొదలైన జీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
తేలికగా జీర్ణం కావడంతో ఆరోగ్యంగా ఏదైనా తినాలనుకుంటే ఆహారంలో స్టీల్ కట్ ఓట్స్‌ని చేర్చుకోవచ్చు. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీనిని తీసుకున్న తర్వాత చాలా కాలం పాటు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అంతేకాదు ఇందులోని పోషఖాలు రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి.
మీరు ఆహారంలో అరటిని చేర్చుకోవచ్చు. ఇందులో సహజ చక్కెర ఉంటుంది. ఇందులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తిన్న తర్వాత మీరు శక్తివంతంగా ఉంటారు. మానసిక స్థితిని కూడా మెరుగుపడుతుంది. అరటిపండ్లను స్మూతీస్, షేక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్ శక్తి స్థాయులను పెంచడంలో సహాయపడతాయి. అవిసె గింజలు, గుమ్మడి గింజలు, వేరుశెనగ, బాదం మొదలైనవి మెనూలో చేర్చుకోవచ్చు. వీటిలో సెలీనియం, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
క్వినోవాలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్, డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. పైగా ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. క్వినోవా తిన్న తర్వాత, మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
మొలకలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మొలకలు తీసుకోవడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ఐరన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఐరన్ విరివిగా ఉంటాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..