
మామిడి తొక్కను తొక్క తీసుకోకుండా నేరుగా తింటే కష్టంగా ఉంటుంది. అందుకే తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో ఉడకించి అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగితే రుచిగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుభ్రం చేయడంలో శరీరంలో ఉండే హానికర పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ ఇలా తీసుకుంటే శరీరంలో కాలుష్యం తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మామిడి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ ఇస్తుంది. ఇవి వివిధ రకాల జబ్బులు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహకరిస్తాయి. అంతే కాకుండా ఇది శరీరంలో వృద్ధాప్య చర్యలను కూడా ఆలస్యం చేస్తుంది.
ప్రతిరోజూ కూరగాయలతో మాత్రమే కాకుండా.. మామిడి తొక్కతో కూడా పచ్చడి చేయడం చాలా రుచికరంగా ఉంటుంది. తొక్కను సన్నగా తరిగి ఆవాల పొడి, ఉప్పు, మిరప పొడి నూనెతో కలిపి కొన్ని రోజులు నిల్వ ఉంచితే అద్భుతమైన పచ్చడి తయారవుతుంది. ఇది భోజనానికి మరింత రుచిని ఇస్తూ ఆకలిని పెంచుతుంది. ఈ పచ్చడితో మీరు సాధారణంగా తినే ఆహారం కంటే ఎక్కువ ఆహారం కూడా తినగలుగుతారు.
మామిడి తొక్కలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారం శరీరంలో బాగా జీర్ణమై, అవసరమైన పోషకాలు సరిగ్గా శోషించబడతాయి. దీని వల్ల శరీరం బరువు పెరగకుండా తగినంత శక్తి పొందుతుంది. కాబట్టి బరువు నియంత్రణ చేయాలనుకునే వారికి మామిడి తొక్క చాలా ఉపయోగకరం.
ఇంకో మంచి విషయం ఏంటంటే.. మామిడి తొక్కలో ఉన్న విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమల సమస్యలు తగ్గిపోతాయి. వృద్ధాప్యం వల్ల వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి.
పరిశోధనల ప్రకారం గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి మామిడి తొక్క చాలా ఫలప్రదం. ఇది ఫోలేట్ ని అందించి శిశువు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన పోషకం అందిస్తుంది. అందుకే గర్భధారణ సమయంలో సరైన మోతాదులో మామిడి తొక్కను తీసుకోవడం మంచిది.
వంటల్లో కూడా మామిడి తొక్కను సులభంగా ఉపయోగించవచ్చు. పచ్చడి, చట్నీ రూపంలో తీసుకోవడం లేదా ఉడికించి తేనె, నిమ్మరసం కలిపి తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని తరచుగా ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మామిడి తొక్కలోని విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఇది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)