Tomato Benefits: టమాటాలకు ఎవరెవరు దూరంగా ఉండాలి.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి!

| Edited By: Ram Naramaneni

Oct 12, 2023 | 9:47 PM

కూరగాయల్లో మనం ఉపయోగించే వాటిల్లో టమాటాలు కూడా ఒకటి. టమాటాలతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. టమాటాలను కేవలం కూరలకే కాకుండా.. చర్మం మెరుపు కోసం, జుట్టును కాపాడుకోవడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం అన్ని రకాలుగా ఉపయోగ పడుతుంది. రోజుకో టమాటాను తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. టమాటాలతో ఏ వంట చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాల ధర ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా కొనడం మాత్రం ఆపరు. వీటి కోసం క్యూ..

Tomato Benefits: టమాటాలకు ఎవరెవరు దూరంగా ఉండాలి.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి!
Tomato
Follow us on

కూరగాయల్లో మనం ఉపయోగించే వాటిల్లో టమాటాలు కూడా ఒకటి. టమాటాలతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. టమాటాలను కేవలం కూరలకే కాకుండా.. చర్మం మెరుపు కోసం, జుట్టును కాపాడుకోవడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం అన్ని రకాలుగా ఉపయోగ పడుతుంది. రోజుకో టమాటాను తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. టమాటాలతో ఏ వంట చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాల ధర ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా కొనడం మాత్రం ఆపరు. వీటి కోసం క్యూ లైన్లలో ఉండి మరీ టమాటాలను తెచ్చుకుంటారు. అయితే వర్షా కాలం, చలి కాలం వచ్చే సరికి టమాటాల వాడకాన్ని తగ్గించేస్తారు. ఎందుకంటే టమాటాల్లో వాతవ చేసే గుణం ఉంది. దీనికి జోడు వాతావరణం చల్లగా ఉంటుందని టమాటా వాడకాన్ని తగ్గించేస్తారు. ఇలాంటివి చాలా రకాల అపోలు ఉంటాయి. అయితే వర్షా కాలం, చలి కాలంలో కూడా టమాటలను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా టమాటాలను ఎవరెవరు తీసుకోవచ్చు? ఎలాంటి ప్రయోజనాలు తెలుసుకుందాం.

షుగర్ వ్యాధి గ్రస్తులు:

షుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవాళ్లు కూడా టమాటాలకు దూరంగా ఉంటారు. టమాటాలను తింటే షుగర్ లెవల్స్ పడుతూంటాయని అనుకుంటారు. కానీ టమాటాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి మధు మేహంతో బాధ పడేవారు కూడా టమాటాలను తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

గర్భిణీ స్త్రీలు:

చాలా మంది గర్భిణీ స్త్రీలకు టమాటాతో చేసిన ఆహార పదార్థాలను పెట్టరు. టమాటాల్లో వేడి గుణం ఉంటుందని.. దీంతో కడుపుతో ఉన్నవారికి వేడి చేస్తుందని టమాటాలను దూరంగా ఉంచుతారు. కానీ ఇది ఎంత మాత్రం తప్పు. గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే పోషకాల్లో ఫోలేట్ కూడా ఒకటి. ఇది శిశువు ఎదుగుదలకు బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఫోలేట్ టమాటాల్లో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కడుపుతో ఉన్నవారు ఎలాంటి సందేహం లేకుండా టమాటాలను తీసుకోవచ్చిన ఆరోగ్య నిపుణులు చెబుతు్నారు.

చర్మం కాంతి వంతంగా తయారవుతుంది:

టమాటాలను ఆహారంగా తీసుకున్నా లేదా.. ఫేస్ ప్యాక్ గా వేసుకున్నా కూడా చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. ముఖంపై ఉండే జిడ్డు, మురికి, బ్యాక్టీరియా వంటివి పోతాయి. చర్మం శుభ్ర పడుతుంది. కాబట్టి చర్మ సౌందర్యానికి టమాటా బాగా హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాల నుంచి స్కిన్ ని రక్షిస్తుంది టమాటాలు. వీటిని తీసుకోవడం వల్ల ముసలి తనం తొందరగా రాదు.

రక్త పోటు అదుపులో ఉంటుంది:

టమాటాలను తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ వంటివి అదుపులో ఉంటాయి. రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా కంట్రోల్ చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. టమాటలు తినడం వల్ల లైకోపీన్ కొలన్, లంగ్, ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉంటాయి.

జీర్ణ శక్తి పెరుగుతుంది:

టమాటాలను మనం ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. తిన్న ఆహారం నిల్వ ఉండకుండా వెంటనే జీర్ణం అవుతుంది. మల బద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది కాబట్టి.. కొవ్వు పేరుకుపోదు. దీంతో బరువు కూడా తగ్గుతారు.

కంటి చూపు మెరుగు పడుతుంది:

టమాటాల్లో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి చూపు మెరుగు పడుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలు కూడా తొందరగా రావు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.